Telangana: బజ్జీల కోసం దారుణం.. అప్పు ఇవ్వలేదని సలసల కాగుతున్న నూనెను..

బజ్జీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. ఈక్రమంలో ఓ వ్యక్తి బజ్జీలు అప్పు అడిగాడు.. అతనేమో ఇవ్వనని కరాఖండిగా చెప్పాడు.. దీంతో రగిలిపోయిన.. ఆ వ్యక్తి.. సలసల కాగే నూనెను బజ్జీలు అమ్మే వ్యక్తిపై పోశాడు.. ఈ దారుణ ఘటన జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నెలో చోటుచేసుకుంది.

Telangana: బజ్జీల కోసం దారుణం.. అప్పు ఇవ్వలేదని సలసల కాగుతున్న నూనెను..
Mirchi Bajji
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 30, 2024 | 1:29 PM

బజ్జీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. ఈక్రమంలో ఓ వ్యక్తి బజ్జీలు అప్పు అడిగాడు.. అతనేమో ఇవ్వనని కరాఖండిగా చెప్పాడు.. దీంతో రగిలిపోయిన.. ఆ వ్యక్తి.. సలసల కాగే నూనెను బజ్జీలు అమ్మే వ్యక్తిపై పోశాడు.. ఈ దారుణ ఘటన జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నెలో చోటుచేసుకుంది. బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని కాగుతున్న నూనెను యాజమానిపై పోశాడు ఓ వ్యక్తి.. ఈ ఘటనలో ఘటనలో యజమానితో పాటు మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గువ్వలదిన్నై చెందిన బొజ్జన్నగౌడ్ స్థానికంగా మిర్చీ బజ్జీల దుకాణం నడుపుతున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి బజ్జీలు కావాలని కోరాడు. యజమాని డబ్బులు అడగ్గా తరువాత ఇస్తానని సమాధానం ఇచ్చాడు. ఉద్దెర కుదరదని చెప్పాడు బొజ్జన్న గౌడ్.. దీంతో అగ్రహంతో ఊగిపోయిన వినోద్ తనకు ఉద్దెర ఎందుకు ఇవ్వవు అని యజమానితో గొడపడ్డాడు.

ఎట్టి పరిస్థితుల్లో ఉద్దెర ఇచ్చేది లేదని యజమాని బొజ్జన్న గౌడ్ తేల్చిచెప్పాడు. దీంతో వినోద్ కోపంతో రగిలిపోయాడు.. కళాయిలో కాగుతున్న వేడి వేడి నూనెను యాజమాని బొజ్జన్నగౌడ్ పై పోశాడు. అయితే నూనె నుంచి తప్పించుకునే క్రమంలో విరేశ్ అనే వ్యక్తి వెనకాల దాక్కున్నాడు బొజ్జన్న.. ఈ క్రమంలో సలసల కాగుతున్న నూనె విరేశ్ ముఖంపై పడడంతో తీవ్రగాయాలు అయ్యాయి.

ఈ ఘటనలో వీరేశ్ ముఖంపై చర్మం పూర్తిగా కాలిపోయింది. క్షతగాత్రులను కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ లో అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న వీరేశ్ భార్య శంకరమ్మ ఘటనకు బాధ్యుడైన వినోద్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన జరిగిన సందర్భంలో వినోద్ మద్యం తాగి ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. బజ్జీల కోసం ఇంత దారుణానికి ఒడిగట్టాడం గువ్వలదిన్నెలో కలకలం రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..