Hyderabad: ఆధునిక రాబిన్ హుడ్.. పెద్దింట్లో దోచుకుని పేదలకు సాయం చేసే మంచి దొంగ.. చివరకు

| Edited By: Surya Kala

Dec 24, 2023 | 11:43 AM

ఒక మోస్ట్ వాంటెడ్ పర్సన్.. దొంగలందు ఈ దొంగ వేరు అన్నట్టు.. పెద్దల వద్ద దొంగలించి గ్రామీణ అభివృద్ధికి ఖర్చు చేస్తాడు కేవలం బంగారు, నగదు మాత్రమే దొంగలిస్తాడు. ఆ ఇంట్లో ఎన్ని విలువైన వస్తువులున్నా వాటి జోలికి వెళ్ళడు. సీసీ కెమెరాలుకు చిక్కకుండా ఒక ఇంటి పై నుండి మరొక ఇంటి పైకి దూకుతూ జారుకుంటాడు.. అంతేకాదు  నగరంలో జూబ్లీహిల్స్ లోనే దొంగతనాలు పాల్పడతాడు. ఏదైనా ప్రాంతంపై దృష్టి పెట్టాడు అంటే..  పోలీసులకు ఎటువంటి చిన్న క్లూ కూడా దొరక్కుండా పకడ్బందీగా దొంగతనం చేస్తాడు

Hyderabad: ఆధునిక రాబిన్ హుడ్.. పెద్దింట్లో దోచుకుని పేదలకు సాయం చేసే మంచి దొంగ.. చివరకు
Mohammad Irfan
Follow us on

రాబిన్ హుడ్.. ఈ పేరు వినగానే కిక్ సినిమా గుర్తుకు వస్తుంది.. ఈ సినిమా లో రాబిన్ హుడ్ స్ఫూర్తి తో తెరకెక్కింది. బడాబాబుల వద్ద దోచుకొని మొహం కనిపించకుండా, కెమెరాలకు చిక్కకుండా, దొరకకుండా పెద పిల్లలకు, క్యాన్సర్ తో బాధ పడుతున్న వారికి తాను దోచుకున్నదంతా పంచిపెడతాడు హీరో…ఇదంతా ఓ సినిమా.. కానీ నిజ జీవితంలో కూడా ఓ రాబిన్ హుడ్ ఒకడున్నాడు.. ఇతను ఒక మోస్ట్ వాంటెడ్ పర్సన్.. దొంగలందు ఈ దొంగ వేరు అన్నట్టు.. పెద్దల వద్ద దొంగలించి గ్రామీణ అభివృద్ధికి ఖర్చు చేస్తాడు కేవలం బంగారు, నగదు మాత్రమే దొంగలిస్తాడు. ఆ ఇంట్లో ఎన్ని విలువైన వస్తువులున్నా వాటి జోలికి వెళ్ళడు. సీసీ కెమెరాలుకు చిక్కకుండా ఒక ఇంటి పై నుండి మరొక ఇంటి పైకి దూకుతూ జారుకుంటాడు.. అంతేకాదు  నగరంలో జూబ్లీహిల్స్ లోనే దొంగతనాలు పాల్పడతాడు. ఏదైనా ప్రాంతంపై దృష్టి పెట్టాడు అంటే..  పోలీసులకు ఎటువంటి చిన్న క్లూ కూడా దొరక్కుండా సెల్ ఫోన్ లో సిమ్ వేసుకోకుండా కేవలం నెట్టుతోనే వాట్స్అప్ కాల్స్ మాత్రమే వాడుతూ అత్యంత పకడ్బందీగా దొంగతనం చేస్తాడు.  హైదరాబాద్ ముంబై మధ్య రాకపోకలు కొనసాగిస్తున్నాడు. గత నాలుగేళ్లుగా బెంగళూరు ,ఢిల్లీ ,హైదరాబాద్ పోలీసులు ఇతని కోసం గాలిస్తున్నారు. అలాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయినటువంటి రాబిన్ హుడ్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసే రిమాండ్ కి తరలించారు. వివరాల్లోకి వెళ్తే…

బీహార్ కు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ అలియాస్ రాబిన్ హుడ్ ఉజ్వల్ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్లలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కంటపడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈనెల 9న జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసిస్తున్న అనురాగ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు రాబిన్.  బాధితుడి ఫిర్యాదు మేరకు రాబిన్ కోసం గాలించినటువంటి పోలీసులు నాలుగైదు రోజులలో 75 పైగా సీసీ కెమెరాలు వెతకగా వెంకటగిరిలోని ఓ ఇంటి వద్ద ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు అతని ఆనవాళ్లు కనిపించాయి. ఈ విధంగా రాబిన్ మొదటిసారిగా కెమెరా కు చిక్కాడు

పాత నేరస్తుల ఫోటోలను పరిశీలనలో రాబిన్ హుడ్ మామూలోడు కాదని కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగగా తేలింది. నగరానికి దొంగతనానికి వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా లక్డికాపూల్ లోని ఓ హోటల్లో తనకు కలిసి వచ్చేటటువంటి రూమ్ లో బస చేసేవాడు. ఇది తెలుసుకున్న టు వంటి పోలీసులు హోటల్ ప్రాంతంలో మకాం వేశారు. కాపు కాసి రాబిన్ హుడ్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ చేయగా ఈ నెల 8న దొంగతనానికి ఇక్కడికి వచ్చినట్లుగా తెలిపాడు.. కార్లను సైతం దొంగలించి అదే కార్లలో తాను దొంగతనం చేయాల్సినటువంటి ఇంటిని గురించి తెలుసుకోవడానికి రెక్కీ నిర్వహిస్తాను అని చెప్పాడు

ఇవి కూడా చదవండి

సినిమాల్లో కొన్ని సన్నివేశాలలో దొంగతనం అనంతరం తప్పించుకునేందుకు ఒక ఇంటి పై నుండి మరొక ఇంటి పైకి దూకడం లాంటి సన్నివేశాలు చూసి ఉంటాము కానీ రాబిన్ హుడ్ సైతం మొదటగా సీసీ కెమెరాలు లేనటువంటి ఇంటిని ఎంచుకొని దొంగతనాలు చేస్తానని విచారణలో తెలియజేశాడు. సీసీ కెమెరాల కంటపడకుండా ఒక ఇంటి పైనుండి మరొక ఇంటిపైకి దూకే వాడనని చెప్పాడు అదే రోజు రాత్రి ముంబైలోని తన రెండవ భార్య బార్ గర్ల్ గుల్షన్ ఇంటికి వెళ్ళాను అని తిరిగి దొంగతనం చేయడానికి నగరం వచ్చినట్లు తెలిపాడు. ప్రముఖులు బడా బాబుల ఇల్లే టార్గెట్గా దొంగతనాలు చేస్తుంటానని విచారణలో తెలియజేశాడు. తాను దొంగతనం చేసిన సొమ్ములో 50 శాతం పేదలకు ఆహారం, స్కూల్ ఫీజులు, ఆసుపత్రుల ఫీజులు కడతానని చెప్పాడు. అందువల్లనే తనకు రాబిన్ హుడ్ అని పేరు వచ్చినట్లు విచారణలో వెల్లడించాడు

అయితే రాబిన్ ఫుడ్ కు ముగ్గురు భార్యలు ఉన్నారు. మరో యువతీతో ప్రస్తుతం ప్రేమాయణం నడుపుతున్నట్టు తెలిసింది. దోచుకున్నటువంటి ఈ సొత్తుతో స్వగ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో ఉజ్వల్ అనే పేరు పెట్టారని వెల్లడించాడు.. తన మొదటి భార్య జడ్పీ చైర్ పర్సన్ రెండవ భార్య బార్ గర్ల్ గా పని చేస్తుంది. మూడవ భార్య కోల్ కతా లో నివసిస్తూ ఉండగా ప్రస్తుతం పూజ అనే యువతితో ప్రేమలో ఉన్నాడు రాబిన్. హైదరాబాదులో నాలుగు, బెంగళూరులో ఏడు, న్యూఢిల్లీలో నాలుగు కేసులు ప్రస్తుతం రాబిన్ మీద ఉన్నాయి. అతనితో పాటు దొంగతనానికి తీసుకువెళ్లే స్క్రూ డ్రైవర్లు రాడ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..