Tiger: రక్తం రుచి మరిగిన పులి.. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో సంచారం.. వణికిపోతున్న జనం

|

Aug 18, 2022 | 11:42 AM

మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో మరోసారి మ్యాన్‌ ఈటర్‌ కలకలం స‌ృష్టిస్తోంది. మూడు రోజుల గ్యాప్‌లోనే నలుగురిని చంపింది. చుట్టుపక్కల గ్రామాల పరిధిలో..

Tiger: రక్తం రుచి మరిగిన పులి.. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో సంచారం.. వణికిపోతున్న జనం
Tiger
Follow us on

పులి మేకను చంపితే పెద్దగా పట్టించుకోం. అదే పులి మనిషిని చంపితే గాబరా పడతాం. కానీ ఆ పులికి మనిషైనా, మేకైనా ఒకటే. మామూలు పులి కాదది, మనిషి రక్తం మరిగిన పులి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో మరోసారి మ్యాన్‌ ఈటర్‌ కలకలం స‌ృష్టిస్తోంది. మూడు రోజుల గ్యాప్‌లోనే నలుగురిని చంపింది. చుట్టుపక్కల గ్రామాల పరిధిలోని ప్రజలకు ఈ మృగం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. బయటకి వస్తే మాటేసిన పులి ఎటువైపు నుంచి ఎటాక్ చేస్తుందో తెలియక ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటున్నారు స్థానికులు. రక్తం మరిగిన పులిసంచారంతో మహరాష్ట్ర చంద్రపూర్‌ జిల్లా వణుకుతోంది. వరుసదాడులతో ఒక్కొక్కరిపై పంజావిసురుతూ ప్రాణాలు తీస్తోంది.

రెండ్రోజుల క్రితం నాగభీడ్‌ తాలూకా మెండ భగవాన్‌పూర్‌లో రైతు విలాస్‌ రంఘయే, సిందెవాహి తాలుకాలో రాందాస్ అనే పశువుల కాపరిని పులి బలితీసుకుంది. ఒక్కరోజు గ్యాప్‌లో మరో ఇద్దరిపై పంజా విసిరింది. బ్రహ్మపురి తాలూకా దూద్‌వాహికి చెందిన ముఖరూరౌత్‌, పద్మాపుర్‌ బుజ్రుకు చెందిన మడవి ప్రభాకర్‌ అనే రైతును పొట్టనబెట్టుకుంది. మూడ్రోజుల్లో నలుగురు పులికి ఆహారం కావడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. తమను కాపాడాలని అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు.

గ్రామాలపై విరుచుకుపడుతున్న పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. పులి పాదముద్రల ఆధారంగా నలుగురిని చంపింది ఒకే పులిగా నిర్ధారణకు వచ్చారు. పులిని బంధించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం