Telangana: భద్రాచలంలో విషాదం.. గోదావరిలో మునిగి వ్యక్తి గల్లంతు

|

May 16, 2022 | 9:00 AM

కుటుంబాన్ని పోషించుకునేందుకు, పొట్ట చేతబట్టుకుని పొరుగు రాష్ట్రం నుంచి వచ్చాడు. రాముల వారి సన్నిధిలో ఉంటూ ఆలయ నిర్మాణ పనులు చేపట్టాడు. కొన్ని నెలలుగా చేస్తున్న పనులు పూర్తవడంతో స్వగ్రామానికి వెళ్లేందుకు అన్నీ....

Telangana: భద్రాచలంలో విషాదం.. గోదావరిలో మునిగి వ్యక్తి గల్లంతు
Godavari
Follow us on

కుటుంబాన్ని పోషించుకునేందుకు, పొట్ట చేతబట్టుకుని పొరుగు రాష్ట్రం నుంచి వచ్చాడు. రాముల వారి సన్నిధిలో ఉంటూ ఆలయ నిర్మాణ పనులు చేపట్టాడు. కొన్ని నెలలుగా చేస్తున్న పనులు పూర్తవడంతో స్వగ్రామానికి వెళ్లేందుకు అన్నీ సర్దుకున్నాడు. సరదాగా ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి గోదావరి(Godavari) లో దిగాడు. లోతు అంచనా వేయలేక గల్లంతయ్యాడు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) గుంటూరు జిల్లాలోని మంగళగిరి ప్రాంతానికి చెందిన కొంతమంది కూలీలు భద్రాచలం(Bhadrachalam) రామాలయానికి సంబంధిన కాటేజీ నిర్మాణ పనుల కోసం వచ్చారు. అక్కడే ఉండి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో కాటేజీ పనులు పూర్తి కావడంతో ప్రస్తుతం ప్రైవేటు నిర్మాణ పనులు చేస్తున్నారు. సోమవారం యాసిన్‌ అనే వ్యక్తి తమ స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు గోదావరికి వెళ్లారు. ఈత కొట్టేందుకు మొత్తం ఆరుగురు నీటిలో దిగారు. వీరిలో ఇద్దరు నదిలో దిగగా మిగతావారు ఒడ్డున ఉన్నారు. నీటిలో దిగిన ఇద్దరిలో యాసిన్ కూడా ఉన్నాడు. ఈత కొడుతున్న సమయంలో యాసిన్ లోతును అంచనా వేయలేకపోయాడు. నీటి ఉద్ధృతికి మునిగిపోయాడు.

ఒడ్డునే ఉన్న స్నేహితులు గమనించి, సమీపంలో ఉన్న గజ ఈతగాళ్లకు సమాచారం అందించారు. వారు వెంటనే నీటిలో దిగి గల్లంతైన వారి కోసం గాలించారు. గల్లంతైన వ్యక్తికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తోటి కార్మికులు తెలిపారు. ఇంటికెళ్దామనుకున్న సమయంలో ఈ దుర్ఘటన జరగిందని తోటి వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. రాత్రి అయినా యాసిన్ ఆచూకీ లభ్యం కాలేదు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

Snakes Video: చెట్టుకు వేలాడుతున్న పాముల కుప్ప.! వీడియో చుస్తే ఒళ్ళు గగుర్పొడిచేయడం ఖాయం..!

Gopichand: అప్పట్లో థామస్ కప్ గెలుస్తామంటే వాళ్లు చులకనగా నవ్వారు.. పుల్లెల గోెపిచంద్ సంచలన కామెంట్స్