Telangana: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి.. స్పాట్‌లోనే..

|

Apr 07, 2023 | 2:49 PM

హుస్నాబాద్‌లో KMR క్రికెట్ టోర్నమెంట్‌లో అపశృతి చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ కార్డియాక్ అరెస్ట్‌తో ఆంజనేయులు అనే వ్యక్తి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

Telangana: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి.. స్పాట్‌లోనే..
Cricket
Follow us on

అసలు ఈ చిట్టి గుండెకు ఏమయ్యింది..? ఈ మధ్య కాలంలో టీనేజ్ కుర్రాళ్లు, యువకులు గుండెపోటుతో మరణించడం అంతుచిక్కని ప్రశ్నంగా మారింది. దీనిపై రీసెర్స్ జరగాల్సిన అవసరం కనిపిస్తుంది.

తాజాగా గుండెపోటుతో మరో వ్యక్తి గుండె ఆగిపోయింది. క్రికెట్‌ ఆడుతూ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఏప్రిల్‌ 7న చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన శనిగరం ఆంజనేయులు(37).. ఫ్రెండ్స్‌తో కలిసి KMR క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడేందుకు హుస్నాబాద్‌ వెళ్లాడు. గేమ్‌లో భాగంగా బౌలింగ్ చేసే క్రమంలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి స్నేహితులు హుస్నాబాద్‌లోని గవర్నమెంట్‌ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆంజనేయులుకు భార్య, తల్లి ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుండెపోట్ల బారిన పడకుండా యువత కూడా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. డైలీ తేలికపాటి వ్యాయామం చేయాలి. ఫుడ్ విషయంలో జాగ్తత్తలు పాటించాలి. జంక్ ఫుడ్ మానేస్తే మంచిది. ఆహారంలో ఉప్పు, ఆయిల్ వంటివి తగ్గించాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..