Ready Made House: ఆకట్టుకుంటున్న రెడీమేడ్ హౌస్.. అన్ని హంగులతో వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన రైతు

|

Jul 06, 2021 | 2:20 PM

House: చాలామంది అన్ని హంగులతో సొంతింటి కలను నేరవెర్చుకోవడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుంటుంటారు. వ్యయ ప్రయాసలతో కూడిన పని అయినప్పటికీ.. ఇంటి నిర్మాణంలో అస్సలు వెనక్కు తగ్గకుండా

Ready Made House: ఆకట్టుకుంటున్న రెడీమేడ్ హౌస్.. అన్ని హంగులతో వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన రైతు
Ready Made House
Follow us on

( Revan Reddy, TV9 Telugu Reporter, Nalgonda )

Gudibanda Ready Made House: చాలామంది అన్ని హంగులతో సొంతింటి కలను నేరవెర్చుకోవడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుంటుంటారు. వ్యయ ప్రయాసలతో కూడిన పని అయినప్పటికీ.. ఇంటి నిర్మాణంలో అస్సలు వెనక్కి తగ్గకుండా నిర్మించుకుంటారు. దాని కోసం అప్పులు చేస్తారు.. పొలాలు అమ్ముకుంటుంటారు. అయితే.. నేటి ఆధునిక కాలంలో రిస్క్ తీసుకోలేని వారు రెడీమేడ్ ఇళ్లపై దృష్టి సారిస్తూ.. తమ సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. అయితే ఖర్చు తక్కువగా అవుతుండటం.. ఇల్లు అందంగా కనిపిస్తుండటంతో.. చాలామంది అలాంటి ఇంటి నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి రెడీమెడ్ ఇంటి నిర్మాణం తెలంగాణ సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం గుడిబండలో కొలువుదిరింది. గ్రామానికి చెందిన రైతు రామిరెడ్డి ఈ ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు.

ఆధునిక హంగులతో రెడీమేడ్ ఇల్లు..
గుడిబండ గ్రామానికి చెందిన చింత ఆనంత రామిరెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ఈ ఇంటిని నిర్మించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీకి ఈ ఇంటిని నిర్మించి ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారు. దీంతో ప్రైవేట్ కంపెనీ వారు కాంక్రీట్ సిమెంట్,ఇనుము అవసరం లేకుండా ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో ఆధునిక హంగులతో ఇంటిని నిర్మించి ఇచ్చారు. హైదరాబాద్ నుంచి గుడిబండకు కంటేనర్ ద్వారా ఈ మెటిరీయల్‌ను తెచ్చి అమర్చారు.

అన్ని వసతులు..
ఇందులో నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపోయే అన్ని వసతులు ఉన్నాయి. ఒక హాలు, బెడ్రూం, కిచెన్, టాయిలెట్స్‌తో అధునాతన పద్దతిలో నిర్మించారు. ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల ఖర్చు అయిందని రామిరెడ్డి తెలిపారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఎనిమిది అడుగుల ఎత్తులో నిర్మించి ఉన్న పిల్లర్లపై రెండు క్రేన్ల సహాయంతో ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ పక్కల పచ్చని వాతావరణంలో 33 గజాల స్థలంలో నిర్మించిన ఈ విలాస వంతమైన ఇంటిని చూడటానికి చుట్టుపక్కల గ్రామస్థులు తండోపతండాలుగా వస్తున్నారు.

సిమెంట్, ఇనుము ధరలు అధికంగా ఉన్న వేళ తక్కువ ఖర్చుతో రెడీమేడ్ మెటీరియల్‌తో ఇంటి నిర్మాణం చేపట్టామని చేపట్టినట్లు రామిరెడ్డి వెల్లడించాడు. ప్రస్తుత ఆధునిక కాలంలో సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు చాలా మంది రెడీమేడ్ ఇళ్లపై ఆసక్తి చూపుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. అయితే.. ఈ ఇంటి నిర్మాణం ప్రస్తుతం చూపరులను ఆకట్టుకుంటోంది.

Also Read:

Rats Drunk: ఎలుకలా మజకా..! 12 బాటిళ్ల ముందు లాగించేసిన మూషికాలు.. నోరెళ్లబెట్టిన ఎక్సైజ్ అధికారులు

EPFO Rules: ఉద్యోగం మానేసిన వెంటనే పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేశారా.? ఈ ప్రయోజనాలను కోల్పోయినట్లే!