Viral Photo: తెలుగు రాష్ట్రాల్లో ప్రజంట్ తెగ ట్రెండ్ అవుతున్న పిక్.. ఈ ఫోటో వెనుక కథ – కమామిషు ఇదే

తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క.. ఏపీ టీడీపీ సీనియర్ లీడర్ చింతమనేని ప్రభాకర్ కలిసి ఉన్న ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటో వెనుక వివరాలు తెలుసుకుందాం పదండి.

Viral Photo: తెలుగు రాష్ట్రాల్లో ప్రజంట్ తెగ ట్రెండ్ అవుతున్న పిక్.. ఈ ఫోటో వెనుక కథ – కమామిషు ఇదే
Batti Chintamaneni

Updated on: Aug 12, 2022 | 3:32 PM

AP-Telangana: తెలుగు రాష్ట్రాల్లో విభిన్న నేపథ్యంతో పాటు విభిన్న పార్టీలకు చెందిన ఇద్దరు నాయకుల కలయిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వారే తెలంగాణ సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka). ఏపీ టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్(Chintamaneni Prabhakar). వివాద రహితుడిగా పేరుపొందిన భట్టి.. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. మధిర నియోజనవర్గం నుంచి వరసగా 3వ సారి గెలుపొంది ప్రజంట్ సీఎల్పీ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక చింతమనేని ప్రభాకర్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఏమి చేసినా సంచలనమే. కాకపోతే చింతమనేనికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన్ను ఎల్లప్పుడూ అనుసరించే క్యాడర్ ఉంటుంది. తాజాగా ఈ ఇద్దరు నేతల కలయిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వారిద్దరూ కలిసినప్పుడు తీసిన పిక్స్ ప్రజంట్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. భట్టి విక్రమార్క్ ఆజాదీ కా గౌరవ్ యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రజంట్ ఆయన  వైరా నియోజకవర్గ కేంద్రంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత పనులు నిమిత్తం ఆ ప్రాంతానికి వెళ్లిన  దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్..  భట్టి విక్రమార్కను చూడగానే తన వాహనాన్ని ఆపారు. దిగి వెళ్లి వెంటనే భట్టిని ఆలింగనం చేసుకున్నారు. ఆయన పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అలా కాసేపు భట్టితో కలిసి చింతమనేని అడుగుల వేశారు. అలా ఈ ఇద్దరు నాయకుల కలయిక జరిగిందన్న మాట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..