
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ మాత్రమే నెరవేర్చగలదన్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎల్‌బీ నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించబోతుందన్నారాయన. ఇక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడిందని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు ప్రియాంక.
హుస్నాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలోనూ ప్రియాంక పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటయ్యాయన్నారామె. హుస్నాబాద్ సభ ముగించుకుని వెళ్తూ ఆమె కిషన్ నగర్‌లో జాగిరి రాజయ్య అనే రైతు ఇంటి దగ్గర కాసేపు ఆగారు.. రైతు కుటుంబ సభ్యులతో ముచ్చటించారు ప్రియాంక. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం నిర్వహించిన బహిరంగ సభలో టీపీసీసీ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు రేవంత్. ఇక పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు న్యాయం జరగలేదన్నారు కోమటిరెడ్డి. ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా తెలంగాణలో ప్రచారం మరింత ఉధృతం చేయనుంది.
హుస్నాబాద్ నియోజకవర్గం:
కిషన్ నగర్ లోని ఓ సామాన్యుడి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పలకరించిన ప్రియాంక గాంధీ గారు.
సిద్ది పేట్ జిల్లా హుస్నాబాద్ లో సభ ముగించుకొని రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణం అయిన ప్రియాంక గాంధీ గారు హుస్నాబాద్ మండలం, గాంధీ నగర్ పరిధిలోని కిషన్ నగర్ లో జాగీరు… pic.twitter.com/zsDZqEmMsk
— Telangana Congress (@INCTelangana) November 24, 2023
“తెలంగాణ రైతులు కష్టాల్లో ఉన్నారు. రుణాలు మాఫీ కాలేదు. పెట్రోలు ఖరీదు, డీజిల్ ఖరీదు, ప్రతిదానికీ జీఎస్టీ..
ల్యాండ్ మాఫియా భూములు లాక్కుంటోంది.తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకి రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తుంది. రైతులకు ఏటా రూ.15000, వ్యవసాయ కూలీలకు… pic.twitter.com/gUnvU9cvon
— Telangana Congress (@INCTelangana) November 24, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..