మల్లారెడ్డి.. ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు.. పాలమ్మిన, పూలమ్మిన అనే డైలాగ్‌తో పాపులర్ అయిన మాజీ మంత్రి మల్లారెడ్డి నిత్యం ఎదో విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఒక్కొసారి అయన మాట్లాడినా మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. కొన్ని సార్లు ఆయన డైలాగ్‌లు నెటింట్లో చక్కర్లు కొడుతుంటాయి. దీంతో ఆయన ఏం చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. వివిధ వేడుకల్లో పాల్గొని డ్యాన్స్‌లతో మల్లారెడ్డి దుమ్ము దులుపేస్తాడు. తాజాగా మల్లారెడ్డి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను తన జిమ్ ట్రైనర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో మల్లారెడ్డి జిమ్‌లో తెగ కష్టపడుతూ కనిపించాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి