Hyderabad: వారు చూసేందుకు చిన్న పిల్లల్లా ఉంటారు. వారి వయసు కూడా అంతంతే. ఒకరి వయసు 20 ఉంటే.. మరొకరి వయసు 21 ఏళ్లు ఉంటుంది. వారు చేసే పనులు మాత్రం విస్తుగొలిపేలా ఉంటాయి. గుట్టుచప్పుడు కాకుండా భారీ లావాదేవీలు నిర్వహిస్తూ.. అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే.. శనివారం నాడు మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు భారీ మొత్తంలో హవాలా డబ్బును పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన మాల్కాజిగిరి ఎస్ఓటీ సీఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో బృందం.. భారీ స్థాయిలో డబ్బు తరలిస్తున్న ఇద్దరు యువకులను పట్టున్నారు. సికింద్రాబాద నుంచి యాప్రాల్‌కి జైలో కారులో రూ. 20 లక్షలు హవాలా సొమ్మును తరలిస్తున్నారని సిఐ నవీన్ కుమార్‌కు సమాచారం అందింది.
వెంటనే అలర్ట్ అయిన సీఐ.. తన బృందంతో కలిసి దాడి చేశారు. డబ్బు తరలిస్తున్న కారును ఛేజ్ చేసి పట్టుకున్నారు. కారులో ఉన్న 20 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. కారును సీజ్ చేశారు. డబ్బు తరలిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బును, నిందితులను జవహార్‌నగర్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. నిందితులు హర్ష్ పటేల్(20), కిషన్ పటేల్(21) ఇద్దరూ యాప్రాల్‌లో నివసిస్తూ డిగ్రీ చదువుతుండగా.. వీరి సొంత రాష్ట్రం మాత్రం గుజరాత్ అని పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
India Corona Updates: తగ్గుతున్న కోవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 44,111 కేసులు..738 మరణాలు
Tamil Nadu Lockdown Extends: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం..!