
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్ ఫైట్ నెలకొంటున్న నియోజకవర్గాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం ఒకటి. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ జరిగింది. ఈ సారి ఎన్నికల్లో మైనంపల్లి హనుమంత రావు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. మంత్రి మల్లా రెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీజేపీ నుంచి నారపురాజు రామచందర్ రావు పోటీ చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఈ సీటుపై ప్రత్యేక గురిపెట్టింది. వారి స్ట్రాటజీ ఫలించి బంపర్ మెజార్టీతో బీఆర్‌ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి 49530 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికి 75519 ఓట్లు పోలవ్వగా..బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకు 55427 ఓట్లు పడ్డాయి గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి చేతిలో మర్రి రాజశేఖర్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు.
2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సీ.కనకా రెడ్డి ఇక్కడి నుంచి 2,768 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు 77,132 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి ఎన్ రామచందర్ రావుకు 74,364 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థి నందికంటి శ్రీధర్ 37,201 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆయన మరణంతో 2018లో ఈ సీటును మైనంపల్లికి బీఆర్ఎస్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంత రావు ఇక్కడి నుంచి 73,698 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మైనంపల్లికి 114,149 ఓట్లు దక్కగా.. బీజేపీ అభ్యర్థి ఎన్ రామచందర్ రావు 40,451 ఓట్లు, టీజేఎస్ అభ్యర్థి కపిలవాయి దిలీప్ కుమార్‌కు 34,219 ఓట్లు వచ్చాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్