తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి (Yadadri) శ్రీలక్ష్మీ నరసింహా స్వామి ప్రధానాలయ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజులో భాగంగా ఉదయం మూల మంత్ర హవనం, షోడశకలశాభిషేకం, నిత్య లఘు పూర్ణాహుతి, సాయంత్రం విష్షు నామ సహస్రపారాయణ, ద్వారా తోరణం, జలాధివాసం, పంచగవ్యాధివాసం వంటి వైదిక పూజలు జరుగుతాయని ఆలయ (Temple) అధికారులు తెలిపారు. పంచకుండాత్మక పూజల్లో భాగంగా మంగళవారం ఉదయం బాలాలయం(Balalayam) లో శాంతిపాకం, అవధారలు, చతుస్థానార్చన, తోరణ ధ్వజకుంభారాధనలు కార్యక్రమాలు చేపట్టారు. జ్వాలా, యోగానంద, గండభేరుండ లక్ష్మీనరసింహస్వామి పేరిట మండపంలో తూర్పు వైపు రుగ్వేదం ద్వారా, దక్షిణాదిన యజుర్వేదం, పశ్చిమదిశలో సామవేదం, ఉత్తర ముఖంగా కుండం ఏర్పరిచి అధర్వణ వేదం ఆధారంగా యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈశాన్యంలో ఏర్పాటైన మహాలక్ష్మీ కుండంతో పంచకుండాత్మక సంపూర్ణ మహాయాగం కొనసాగించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి నల్లంథిగల్ లక్ష్మీనరసింహాచార్య తెలిపారు.
వారం పాటూ కొనసాగే పంచకుండాత్మక యాగ నిర్వహణకు బాలాలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో సంప్రోక్షణ పర్వాన్ని చేపట్టి కుండాలను సిద్ధం చేశారు. నిరంతరం పారాయణ పఠనానికి 108 మంది రుత్వికులు సిద్ధమయ్యారు. నలువైపులా ఏర్పాటైన కుండాల మధ్య శ్రీమహాలక్ష్మి కుండంలో నిర్వహించే యాగానికి సంబంధించి పర్యవేక్షకులకు బాధ్యతలు అప్పగించారు. మంగళవారం మొదలైన పంచకుండాత్మక మహాయాగం నిర్వహణకు.. అగ్నిప్రతిష్ఠ, అగ్ని మథనంతో యాగం ప్రారంభమైంది. 108 మంది పండితులతో ఏడు రోజులపాటు సాగే పంచకుండాత్మక యాగం తర్వాత మహాకుంభ సంప్రోక్షణ ఈనెల 28న నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మిథున లగ్నం సుముహూర్తంలో మహాకుంభాభిషేకం, శాంతి కళ్యాణంతో మహాక్రతువు ముగియనుంది.
Also Read
Vijay Devarakonda: జోరుపెంచిన రౌడీ స్టార్.. ఆ స్టార్ దర్శకుడితో విజయ్ సినిమా చేయనున్నాడా.?
Horoscope Today: ఈరాశివారు అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Viral Video: భార్య ఇచ్చిన గిఫ్ట్‌ను చూసి షాకైన భర్త.. ఇంతకీ ఆమె ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే..!