
మహబూబ్ నగర్ నియోజకవర్గంలో (Mahbubnagar Assembly Election) తెలంగాణ ఏర్పడిన నాటినుంచి ఈ స్థానంలో గులాబీ పార్టీ జెండా ఎగరవేస్తోంది. 2014, 2018లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్‌కు చెందిన మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించారు. కాగా.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. మహబూబ్ నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటమిపాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని శ్రీనివాస్ గౌడ్ ఉవ్విళ్లూరురారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి ఆయనకు గట్టి పోటీ ఇచ్చి పై చేయి సాధించారు. బీజేపీ నుంచి మిథున్ రెడ్డి బరిలో నిలిచారు. నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొనగా చివరకు యెన్నం గెలుపొందారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 2,52,355 మంది ఓటర్లు ఉన్నారు. 2023 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 70.56 శాతం పోలింగ్ నమోదయ్యింది.
1952 నుంచి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు సార్లు, బీఆర్ఎస్ 2సార్లు, టీడీపీ రెండు సార్లు, ఇండిపెండెంట్లు 3సార్లు, ప్రజాపార్టీ ఒకసారి, బీజేపీ ఒకసారి గెలుపొందాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ సత్తాచాటుతూ వచ్చింది.. బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్, బీజేపీ కూడా వ్యూహాలు రచిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్