
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై ఓ వృద్ధురాలు తన అభిమానాన్ని చాటుకుంది. ‘బిడ్డా మళ్లీ నువ్వే గెలవాలి.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి’ అని ఆశీర్వదించి, తాను పొదుపు చేసుకుంటున్న పెన్షన్ డబ్బులను ఎన్నికల ఖర్చుల కోసం విరాళంగా ఇచ్చింది. ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్న ఎమ్మెల్యే శంకర్.. ఆ పెద్దవ్వ తొలి ఆశీర్వాదం పొంది తన్మయత్వంతో మురిసిపోయారు.
ఎన్నికలు వస్తున్నాయంటే ఏ లీడర్ ఎంత ఇస్తాడు.. ఏ పార్టీ నుండి ఎంత డబ్బు వస్తుందని ఎదురు చూసే వారే ఎక్కువ.. బరిలో నిలిచే అభ్యర్థులలో కూడా ఎవరి వద్ద ఎంత డబ్బు ఉంది? ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలరని చూసే వారే ఎక్కువగా ఉంటారు. చాలామంది ప్రజలు కూడా ఎన్నికలు వస్తేచాలు నాయకులు తీసుకొచ్చే డబ్బు సంచుల కోసమే ఎదురు చూస్తుంటారు. కానీ మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ వృద్దురాలు మాత్రం ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకుంది. మూడు నెలల పెన్షన్ డబ్బులు జమ చేసుకొని శంకర్ నాయక్ ఎన్నికల ఖర్చుల కోసం విరాళంగా ఇచ్చింది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి వెళ్లిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్థానిక ప్రజల వద్దకు వెళ్లి తనను మరోసారి గెలిపించి అసెంబ్లీ పంపాలని వేడుకున్నారు. ఈ క్రమంలో బొడ్డుగొండ గ్రామానికి చెందిన ముక్క నారాయణమ్మ అనే వృద్ధురాలు శంకర్ నాయక్ పై చూపిన అభిమానానికి ఆయన ఫిదా అయ్యారు. ఈ వృద్ధురాలు పొదుపు చేసుకుంటున్న పెన్షన్ డబ్బులు రూ. 6,000 ఎన్నికల ఖర్చులకు విరాళంగా ఇచ్చింది.
అంతేకాదు శంకర్ నాయక్‌కి నుదుట ముద్దుపెట్టి తల్లిలా ఆశీర్వాదం అందించింది. రాష్ట్రంలో కేసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని, మహబూబాబాద్‌లో శంకర్ నాయక్ హ్యాట్రిక్ విక్టరీ సాధించాలని కోరుకుంది. వారి అభిమానికి ఫిదా అయిన శంకర్ నాయక్.. ‘కచ్చితంగా మీ ఆశీర్వాదం ఫలిస్తుంది.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు.. నేను మహబూబాబాద్ నుండి మీ అందరి ఆశీర్వాదంతో బంపర్ మెజారిటీ సాధిస్తాను’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.
స్వతంత్ర భారత స్వర్ణత్సవ కోటివృక్షర్చన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా గూడూరు మండలం జగన్నాయకుగూడెంలో మొక్కలు నాటడం జరిగింది. @kcr @TSwithKCR @KTRBRS @BRSparty pic.twitter.com/E0vlkLK8Mp
— Banoth Shankar Naik (@BSNBRS) August 26, 2023
మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని గూడూరు మండలం కోల్లపురంలో గ్రామంలో యాదవ కులస్తులకు నేడు గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది. @kcr @TSwithKCR @KTRBRS @BRSparty pic.twitter.com/ZE1PDu4cSQ
— Banoth Shankar Naik (@BSNBRS) August 26, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..