మందుబాబులు బీకేర్ పుల్..! అక్కడికెళ్లి చుక్క,ముక్క అన్నారంటే.. ఖాకీలు చుక్కలు చూపిస్తారు..

| Edited By: Jyothi Gadda

Jul 26, 2023 | 10:21 AM

ములుగు జిల్లా: అక్కడ అటవీశాఖ కఠిన నిబధనలకు శ్రీకారం చుట్టింది.. పర్యాటకులు మద్యం సేవించడం పై నిషేదం విధించారు.. వాహనాల్లో మద్యం బాటిల్స్ కలిగి వుంటే ఆ వాహనం సీజ్ చేస్తారు..

మందుబాబులు బీకేర్ పుల్..! అక్కడికెళ్లి చుక్క,ముక్క అన్నారంటే.. ఖాకీలు చుక్కలు చూపిస్తారు..
Madhobabulu Becare Pull
Follow us on

ములుగు జిల్లా,జులై26: మందుబాబులు బీకేర్ పుల్..  అక్కడ ప్రకృతి అందాలను చూసి మై మరిచి మందు తాగితే రంగు పడుద్ది.. ఆ అడవిలో మందుతాగితే జరిమానా… జేబు కాళీ- వెహికిల్ సీజ్ అటవీశాఖ హెచ్చరిక బోర్డులు అడవుల్లో జలపాతాల వద్ద ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళే వారికి చుక్కా-ముక్కా కామన్.. మరీ ముఖ్యంగా బొగత జలపాతాల సందర్శనకు కుటుంబ సమేతంగా వెళ్ళేవారు తనివితీరా ఎంజాయ్ చేస్తుంటారు.. ఫ్రెండ్స్ తో వెళ్ళినా, ఫ్యామిలీ మెంబెర్స్ వెళ్ళినా ఈ అడవిలో ఓ చుక్కవెస్తేనే కిక్కు.. కానీ ఇప్పుడు సీన్ మారింది.. బొగత జలపాతాల వద్ద మద్యం సేవిస్తే జరిమానా తప్పదు… జేబు కాళీ చేసుకోవాల్సిందే…

ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి ప్రాంతంలోని బొగత జలపాతాల వద్ధ అటవీశాఖ కఠిన నిబధనలకు శ్రీకారం చుట్టింది.. పర్యాటకులు మద్యం సేవించడం పై నిషేదం విధించారు.. వాహనాల్లో మద్యం బాటిల్స్ కలిగి వుంటే ఆ వాహనం సీజ్ చేస్తారు.. బొగత జలపాతం పరిసరాల్లో ఎక్కడ మద్యం సేవించినా రూ. 2000 రూపాయల జరిమానా… ఈరోజు నుండి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.. అటవీశాఖ వాజేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో భోగత జలపాతాల వద్ద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.. గీత దాటితే వేటు తప్పదని సూచిస్తున్నారు..

తెలంగాణ నయాగార గా పేరుగాంచిన బొగత జలపాతం వద్దకు ప్రతినిత్యం వందల మంది పర్యాటకులు రాకపోకలు సాగిస్తుంటారు. బొగత జలపాతం ప్రక్రుతి రమణీయ దృశ్యాలను, జాలువారే నీటిని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుండి పర్యటకులు రాకపోకలు సాగిస్తుంటారు. కొంతమంది యువకులు మద్యం సేవించి, మద్యం బాటిల్స్ హల్ చల్ చేస్తున్నారు.. తనిఖీలు చేస్తున్న సమయంలో అధికారుల కళ్ళు గప్పి బ్యాగులలో మద్యం తీసుకు వెళ్తుంటారు. మద్యం మత్తులో స్నానాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటివరకు స్నానాలకు వెళ్లి మృతి చెందిన సంఘటనలుఅనేకం ఉన్నాయి. పర్యాటకుల భద్రత కోసం వారి రక్షణ కోసం అటవీశాఖ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ నయాగారగ పేరుగాంచిన జలపాతం వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుతో పాటు నిఘా తీవ్రతరం చేశారు.అలాగే అనుమతి లేకుండా జలపాతాల వద్ద కు వెళ్ళ వద్దని పర్యాటకులకు ఫారెస్టు అదికారులు సూచించారు…