Telangana Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

|

Jul 22, 2023 | 8:00 AM

Telangana Rains:  ప్రస్తుతానికి వర్షాలు తగ్గుముఖం పట్టినా.. అది తాత్కాలికమే అంటోంది వాతావరణశాఖ. ఉత్తర తెలంగాణకు ఇప్పటికీ ముప్పు పొంచే ఉందని హెచ్చరిస్తోంది. ఎనీ టైమ్‌, మళ్లీ వరుణుడు విరుచుకుపడటం ఖాయమని వార్నింగ్‌ ఇస్తోంది.

Telangana Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
Rain alert
Follow us on

Telangana Rains: నాన్‌స్టాప్‌గా కురుస్తోన్న వర్షాలకు స్మాల్‌ బ్రేక్‌ పడింది. నాలుగైదు రోజులుగా దంచికొడుతోన్న వరుణుడు కొంచెం విరామం ఇచ్చాడు. దాంతో, ఊపిరి పీల్చుకుంటున్నారు జనం. అయితే, బ్రేక్‌ ఇచ్చాను కదా అని రిలాక్స్‌ అయిపోద్దని వార్నింగ్‌ ఇస్తున్నాడు వరుణుడు. ఎందుకంటే, ఉత్తర తెలంగాణకు రెడ్‌ వార్నింగ్‌ అలాగే ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండొచ్చని ప్రకటించింది.

ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, కొమురంభీమ్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు… హనుమకొండ, వరంగల్‌, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నారాయణపేట్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు… ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. అదే టైమ్‌లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మొత్తం మీద కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ తోపాటు.. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఒకవైపు కుండపోత వానలు, ఇంకోవైపు ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహంతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుత్తోంది. కాళేశ్వరం, మేడిగడ్డ దగ్గర అదే ఉధృతి కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి 5లక్షల క్యూసెక్కుల ఇన్‌ అండ్ ఔట్‌ ఫ్లో కంటిన్యూ అవుతోంది.

ఇవి కూడా చదవండి

నిండుకుండలా మారిన హుస్సేన్‌సాగర్‌కు కూడా వరద నీరు పోటెత్తుతోంది. ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ను దాటేసి డేంజర్‌ లెవల్‌కి చేరింది సాగర్‌ నీటిమట్టం. హుస్సేన్‌సాగర్‌ కెపాసిటీ 513.41 మీటర్లు అయితే ప్రస్తుతం 514.75 మీటర్లపైనే ఉంది. దాంతో మూడు తూముల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.

తెలంగాణలో అలర్ట్స్‌ అన్నీ అలాగే కొనసాగుతున్నాయ్‌!. 4 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, 13 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కంటిన్యూ అవుతున్నాయ్‌!. హైదరాబాద్‌ మహా నగరానికి కూడా ఆరెంజ్‌ వార్నింగ్‌ అలాగే ఉంది!. ప్రస్తుతానికి, సాధారణ వాతావరణం నెలకొన్నా, ఏ క్షణమైనా విరుచుకుపడటం ఖాయం. అందుకే, బీ అలర్ట్‌-టేక్‌ కేర్‌ అంటూ హెచ్చరిస్తోంది వాతావరణశాఖ.

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం..