ఆంజనేయుడి ఆలయం.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డోంగర్ గావ్ గ్రామం.. హనుమాన్ ఆలయంలోని దేవుడి కళ్లు మాయం.. ఎమ్మెల్యే రేఖానాయక్ ఎత్తుకెళ్లారంటూ గ్రామస్తుల ఆందోళన..నెల రోజుల క్రితం ఎమ్మెల్యే రేఖా నాయక్ తమ గ్రామంలో కార్యాలయం నిర్మాణ భూమి పూజ కు వచ్చారు.. అప్పుడే ఆంజనేయుడి కళ్లు తీసుకెళ్లారు అంటున్నారు. ఎమ్మెల్యే ఆంజనేయ స్వామి కళ్లు తీసుకెళ్లడమేంటి.. ఒకవేళ తీసుకున్నారే అనుకుందాం.. ఎందుకు తీసుకున్నారు.. ఈ ప్రశ్నలే ఇప్పుడు జిల్లా అంతటా హాట్ టాపిక్ అయ్యాయి..
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ దేవుని విగ్రహం మీద ఉన్న కళ్లు తీసుకెళ్లిన రోజు నుంచి గ్రామంలో.. ఏదో ఒక సంఘటన జరుగుతోందని వాపోతున్నారు. 10 రోజుల తరువాత గ్రామ పటేల్ మాడవి దేవరావు కళ్ళు చూపు ని కోల్పోయాయి. 5 రోజుల కింద గ్రామ మాజీ పటేల్ పెందుర్ బాబు ఆకస్మాతుగా కంటి చూపుని కోల్పోయారు. ఇది అరిష్టంగా చెప్పుకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్ నేత వినోద్ నాయక్ మద్దతుగా ఉన్న ఈ వీడియో లు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది.
డొంగర్గాం గ్రామం నుంచి తాను వెండి కళ్ళు తీసుకెళ్లిన మాట వాస్తవమేనని.. బంగారు కళ్ళు చేయిస్తానని తెలిపారు. త్వరలోనే మొక్కు తీర్చుకుంటానని.. కాంగ్రెస్ వారు అనవసర రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. తనపై అనవసర విమర్శలు దుష్ప్రచారం చేసేవారు.. డోంగర్గాం గ్రామం కి రావాలని అక్కడే గ్రామస్తుల సమక్షంలో మాట్లాడదామని పేర్కొన్నారు. ఇంద్రవెల్లి మండలం డోంగర్ గావ్ విషయం తెలుసుకున్న ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు వినోద్ నాయక్ హుటాహుటిన గ్రామానికి బయలుదేరి అర్థరాత్రి గ్రామస్తులతో మాట్లాడారు.
గుడిలో రేఖనాయక్ చేసిన అపచారం వల్లే ఇదంతా జరుగుతోందన్నారు. ఇద్దరి కంటి చూపు కోల్పోనికి కారణం అయినా ఎమ్మెల్యేని వెంటనే ఎమ్మెల్యే పదవి నుండి భర్తరఫ్ చేయాలి. వెంటనే ప్రభుత్వం సిట్టింగ్ జడ్జిని అపాయింట్ చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దేవుడు పేరు తో రాజకీయం చేసే బీజేపీ పార్టీ నాయకులు ఇవాళ మౌనంగా ఉండడం వాళ్ళ రెండు నాలుకల ధోరణి కి నిదర్శనం.. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కి ఛలో డోంగర్ గావ్ సవాల్ విసిరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..