Telangana: తెలంగాణలోని నిర్మాణాలకు 5 అంతర్జాతీయ అవార్డులు.. సచివాలయం, కేబుల్ బ్రిడ్జ్, యాదాద్రికి పురస్కారాలు

|

Jun 14, 2023 | 1:17 PM

Green Apple awards: గ్రీన్ యాపిల్ అవార్డులు, మొత్తం ఐదు అవార్డులను అందుకున్న ఘనత తెలంగాణకు దక్కింది. రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ఐదు కట్టడాలకు ఈ 5 అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఈ అవార్డులను లండన్ గ్రీన్ ఆర్గనైజేషన్ ప్రకటించింది.

Telangana: తెలంగాణలోని నిర్మాణాలకు 5 అంతర్జాతీయ అవార్డులు.. సచివాలయం, కేబుల్ బ్రిడ్జ్, యాదాద్రికి పురస్కారాలు
Green Apple Awards
Follow us on

హైదరాబాద్, జూన్ 14: తెలంగాణను మరిన్ని ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. గ్రీన్ యాపిల్ అవార్డులు, మొత్తం ఐదు అవార్డులను అందుకున్న ఘనత తెలంగాణకు దక్కింది. రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ఐదు కట్టడాలకు ఈ 5 అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఈ అవార్డులను లండన్ గ్రీన్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. బ్యూటీఫుల్ వర్క్‌స్పెస్ బిల్డింగ్ కేటగిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనంకు ఈ అవార్డు వరించింది. హెరిటేజ్ కేటగిరిలో మొజామ్-జాహీ మార్కెట్‌కు ఈ అవార్డు దక్కింది. యూనిక్ డిజైన్ కేటగిరిలో దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ కేబుల్ బ్రిడ్జ్‌కు ఈ పురస్కారం రాగా.. స్పెషల్ ఆఫీస్ కేటగిరిలో రాష్ట్ర పోలీసుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు మరో అవార్డు వచ్చింది. అద్భుతమైన మతపరమైన నిర్మాణాల విభాగంలో యాదాద్రి ఆలయానికి గ్రీన్ యాపిల్ అవార్డు వచ్చింది. ప్రతిష్టాత్మకమైన అవార్డును ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఈ నెల 16న లండన్ లో ఈ అవార్డుల ప్రధానం జరుగనుంది.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) సహకారంతో డిపార్ట్‌మెంట్ అర్బన్ & రియల్ ఎస్టేట్ సెక్టార్ కింద ‘అందమైన భవనాల కోసం ఇంటర్నేషనల్ గ్రీన్ యాపిల్ అవార్డ్స్’ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున దరఖాస్తు చేసిందని రాష్ట్ర MA&UD సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. తెలంగాణ. UK ఆధారిత సంస్థ నుండి రాష్ట్రానికి ఈ సంవత్సరం ఉత్తమ అవార్డులు రావడం గర్వకారణమని అధికారి తెలిపారు.

ఈ అవార్డుల ప్రదానోత్సవం జూన్ 16న లండన్‌లో జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున అరవింద్ కుమార్ ఈ అవార్డులను అందుకోనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం