Mahabubabad Politics: ఒక్క ఛాన్స్ ప్లీజ్.. మహబూబాబాద్ పార్లమెంట్ సీటు కోసం పొలిటికల్ పార్టీ నేతల తెగ ఆరాటం..!

| Edited By: Balaraju Goud

Jan 05, 2024 | 7:00 PM

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కోసం తహహలాడుతున్న ఆశవాహులంతా ఒక్క ఛాన్స్ కోసం తెగ ఆరాపడుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధినేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు...కానీ ఆశావహుల భవితవ్యం అంతా సర్వే సంస్థలకు ముడి పెట్టడంతో, ఆ సంస్థల దృష్టిలో పడడం కోసం తెగ ఆరాటపడుతున్నారట. ఈ నేపధ్యంలోనే ST రిజర్వుడ్ నియోజకవర్గం మానుకోట సీటు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Mahabubabad Politics: ఒక్క ఛాన్స్ ప్లీజ్.. మహబూబాబాద్ పార్లమెంట్ సీటు కోసం పొలిటికల్ పార్టీ నేతల తెగ ఆరాటం..!
Mahabubabad Parliament Seat
Follow us on

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కోసం తహహలాడుతున్న ఆశవాహులంతా ఒక్క ఛాన్స్ కోసం తెగ ఆరాపడుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధినేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు…కానీ ఆశావహుల భవితవ్యం అంతా సర్వే సంస్థలకు ముడి పెట్టడంతో, ఆ సంస్థల దృష్టిలో పడడం కోసం తెగ ఆరాటపడుతున్నారట. ఈ నేపధ్యంలోనే ST రిజర్వుడ్ నియోజకవర్గం మానుకోట సీటు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రధాన రాజకీయ పార్టీల్ సీటు కోసం ప్రదక్షిణలు చేస్తున్న ఆ నేతలు ఎవరూ..? ఎవరి బలమెంతా..? బలగమెంతా..? ఒకసారి చూద్దాం..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలపైనే దృష్టి పెట్టాయి. ఏ క్షణాన్నైనా లోక్ సభ ఎన్నికలకు నగార మోగుతుందని బావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆశావాలు కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్లమెంట్లో అడుగు పెట్టాలని తహతలాడుతున్న వారంతా ఒక్క ఛాన్స్ అంటూ పార్టీ అధినేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు.. కానీ అన్ని పార్టీలు సర్వేలపైనే ఆధారపడ్డాయని సమాచారం. సర్వేలు ఏం చెప్తే అదే ఆచరిస్తున్నారనే ప్రచారంతో, ఇప్పుడు ఆశావాహులంతా సర్వే ఏజెన్సీల దృష్టిలో పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారట..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంట్ నియోజక వర్గాలు ఉన్నాయి.. స్థానాన్ని ఒకటి వరంగల్ SC రిజర్వుడ్ నియోజకవర్గం కాగా, రెండవది మహబూబాబాద్ పార్లమెంట్ ఎస్టీ రిజర్వ్ కేటాయించడం జరిగింది. అయితే మహబూబాబాద్ పార్లమెంటులో అన్ని ప్రధాన రాజకీయ బలమైన ఎస్టీ నేతల కోసం కసరత్తు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆశావాహులు కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు, వ్యాపారులు, వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారే టికెట్ రేసులో ప్రయత్నాలు ముందర చేస్తున్నారట.

బీఆర్ఎస్ పార్టీ నుండి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత నే మళ్ళీ బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ LIC అధికారి బిక్షపతి నాయక్ కూడా టిక్కెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ కోసం ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. కానీ అధిష్టానం టికెట్ల కేటయింపులో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, సీనియర్ నాయకుడు బెల్లయ్య నాయక్, భూపాల్ నాయక్, బానోత్ సింఘ్ లాల్ టిక్కెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. మరోవైపు ఆదివాసీ సామాజిక వర్గం నుండి కూడా బలమైన నేతను బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ నుండి హుస్సేన్ నాయక్, యాప సీతయ్య టిక్కెట్ కోసం ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

ఆశావాహుల్లో ఆరాటం ఉరకలేస్తున్నా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. బయ్యారం ఉక్కు నిక్షేపాలు కలిగిన ఈ నియోజక వర్గం నుండి నిలిచేదేవరూ..? గెలిచేదెవరో చూడాలి….

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…