Telangana: వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గాకు తాళం..! కోర్టుకు చేరిన వివాదం.. విషయం ఏంటంటే..

| Edited By: Jyothi Gadda

Sep 07, 2023 | 7:14 PM

Vemulawada: వేములవాడ లో.. రాజన్న దర్శనం చేసుకున్న తరువాత.. ఇక్కడ ఉండే దర్గాను దర్శించుకుంటారు భక్తులు.. అయితే.. దర్గా విషయంలో ముస్లింలు రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి.. రెండేళ్ల కోకసారి దర్గా నిర్వహణ లో మార్పు ఉండాలి.. అలా.. మార్పు జరగక పోవడం తో  ఇరువర్గాల నడుమ గొడవలు మొదలయ్యాయి.

Telangana: వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గాకు తాళం..! కోర్టుకు చేరిన వివాదం.. విషయం ఏంటంటే..
Vemulawada Dargah
Follow us on

కరీంనగర్ జిల్లా, సెప్టెంబర్07: ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలోని దర్గాపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దర్గా నిర్వహణ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో విషయం పోలీసుల వరకు వెళ్లింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టి దర్గాకు తాళం వేశారు. ఈ దర్గా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో ఉంది. కానీ ఈ దర్గాను రెండు ముస్లిం వర్గాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ దర్గాపై తమకు హక్కులు ఉన్నాయని, తమ తాతల కాలం నుంచి తాము నిర్వహిస్తున్నామని ఓ వర్గం చెబుతోంది. దీంతో ఈ దర్గాపై రెండు వర్గాల మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. దీనిపై ఓ వర్గం కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే ఇటీవల దర్గా నిర్వహణ విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

వేములవాడ లో.. రాజన్న దర్శనం చేసుకున్న తరువాత.. ఇక్కడ ఉండే దర్గాను దర్శించుకుంటారు భక్తులు.. అయితే.. దర్గా విషయంలో ముస్లింలు రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి.. రెండేళ్ల కోకసారి దర్గా నిర్వహణ లో మార్పు ఉండాలి.. అలా.. మార్పు జరగక పోవడం తో  ఇరువర్గాల నడుమ గొడవలు మొదలయ్యాయి. దీంతో.. రెండు వర్గాలు ఆలయం లోనే గొడవకు దిగారు. దర్గా విషయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రెండు గ్రూపులను బయటకు పంపించారు. అనంతరం దర్గాకు తాళం వేశారు. దర్గాపై హక్కులు ఉన్నవారు సరైన ఆధారాలు, పత్రాలతో రావాలని పోలీసులు తెలిపారు.

అయితే, దర్గా విషయంలో రెండు వర్గాల వారు ఒక్కో సంవత్సరం నిర్వహణ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, మరొక్క వర్గం అవకాశం ఇవ్వడం లేదు.  ఈ క్రమం లో ఇంకో వర్గం వారు కోర్టు ను ఆశ్రయించారు. దీంతో తమకు కోర్టు అడర్ వచ్చిందని, మీరు వెళ్లిపోవాలని అన డంతో ఇరువురి మధ్య తీవ్ర వివాదం నెలకొంది. దీంతో రెండు వర్గాల వారు గొడవకు దిగారు. దీంతో పోలీసులు వివాదంలో జోక్యం చేసుకున్నారు. దీంతో రాజన్న భక్తులు ఆందోళనలోపడ్డారు.  పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువురిని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల వారు పోలీసుల మాట వినకపోవడంతో దర్గాకు తాళం వేశారు. వివాదం కోర్టు లో వున్నదని దర్గా వైపు ఎవరు రావద్దని తెలిపారు. ఎవరయినా నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..