AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchayat Elections: ముందు పరిషత్, ఆ తర్వాత పంచాయతీ.. 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ నెలాఖరులోగా స్థానికఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని పేర్కొన్నారు. సోమవారం కేబినెట్‌లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందని.. ఆ తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని మంత్రి పొంగులేటి వివరించారు.

Panchayat Elections: ముందు పరిషత్, ఆ తర్వాత పంచాయతీ.. 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
Panchayat Elections
N Narayana Rao
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 15, 2025 | 12:53 PM

Share

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ నెలాఖరులోగా స్థానికఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని పేర్కొన్నారు. సోమవారం కేబినెట్‌లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందని మంత్రి పొంగులేటి వివరించారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం.. సర్పంచ్‌, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని.. కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. గెలిచే అవకాశాలున్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామని స్పష్టంచేశారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమావేశం నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా సమావేశం నిర్వహించిన మంత్రి… ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని పేర్కొన్నారు. నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం అవ్వాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.

ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని పొంగులేటి పేర్కొన్నారు. రాబోవు వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకోని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదేనని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు… వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా నాయకులే చూసుకోవాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..