Leopard: నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం.. ఆవు దూడపై దాడి.. భయాందోళనలో ప్రజలు..

Leopard: తెలంగాణలోని పలు జిల్లాల్లో క్రూర మృగాల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజల కంటిమీద కునుకు..

Leopard: నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం.. ఆవు దూడపై దాడి.. భయాందోళనలో ప్రజలు..
Follow us

|

Updated on: Jan 02, 2021 | 9:36 PM

Leopard Roaming: తెలంగాణలోని పలు జిల్లాల్లో క్రూర మృగాల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కొమురం భీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో పెద్ద పులి సంచారం పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలం జాంగాం అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరించింది. ఆవు దూడపై దాడి చేసింది. ఇది గమనించిన గ్రామస్థులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఒంటరిగా ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చిరుత సంచారంపై గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాదముద్రల ఆధారంగా చిరుత సంచారాన్ని నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిరుత జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు.

Also read:

టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం: రాజకీయ లబ్దికోసం కొత్త నాటకాలు మొదలుపెట్టారన్న మంత్రి ఎర్రబెల్లి

అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు : ‘పోలీసులూ ఖబడ్దార్, ఇక ఎక్కువ కాలం లేదు, లిస్ట్‌ తయారు చేశాం..’