Watch Video: నేలకూలిన చెట్టు.. రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..

| Edited By: Srikar T

Jul 22, 2024 | 8:25 PM

రాత్రి కురిసిన వర్షనికి పాతబస్తీ శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాంశీర్ గంజ్ ప్రాంతంలో 15 సంవత్సరాల కాలం నాటి ఒక చెట్టు కూలింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలుకాగా ఒకరు మృతి చెందారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. హైదరాబాద్‎తో పాటూ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. దీంతో సహాయక చర్యలు ప్రారంభించిన GHMC. అయితే ఈ తరుణంలోనే శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్‎ మధ్యలో ప్రయాణికుల మీద భారీ వృక్షం పడింది.

రాత్రి కురిసిన వర్షనికి పాతబస్తీ శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాంశీర్ గంజ్ ప్రాంతంలో 15 సంవత్సరాల కాలం నాటి ఒక చెట్టు కూలింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలుకాగా ఒకరు మృతి చెందారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. హైదరాబాద్‎తో పాటూ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. దీంతో సహాయక చర్యలు ప్రారంభించిన GHMC. అయితే ఈ తరుణంలోనే శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్‎ మధ్యలో ప్రయాణికుల మీద భారీ వృక్షం పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. 4వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న షాలి బండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న ఫలక్‎నుమ ట్రాఫిక్ పోలీసులు కూడా నేలకిరిగిన చెట్టును తొలగించేందుకు ప్రయత్నించారు. పెద్ద చెట్టుకావడంతో చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది.

ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. పెద్ద చెట్టు కూలడం వల్ల కరెంట్ తీగలు సైతం నేలపై పడిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ ప్రమాదాన్ని గుర్తించిన విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై కరెంటును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు అన్ని శాఖల అధికారులు. GHMC అధికారులు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని చెట్టును తొలగించే పనిలో పడ్డారు. శాలిబండ కార్పొరేటర్ ముస్తఫా అలీ ముజాఫ్ఫర్ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..