Lanke Binde: సూర్యాపేట జిల్లాలో లంకెబిందెల కలకలం.. బిందెడు బంగారంను సరిసమానంగా పంపిణీ చేసిన హోంగార్డు..

|

Jul 12, 2021 | 9:49 AM

సూర్యాపేట జిల్లాలో లంకెబిందె దొరకడం కలకలం రేపుతోంది. చివ్వెంల మండలం తుల్జారావుపేట గ్రామంలోని ఓ వ్యవసాయ భూమిలో ట్రాక్టర్‌ తో దున్నుతుండగా లంకెబిందె లభించినట్లుగా తెలుస్తోంది.

Lanke Binde: సూర్యాపేట జిల్లాలో లంకెబిందెల కలకలం.. బిందెడు బంగారంను సరిసమానంగా పంపిణీ చేసిన హోంగార్డు..
Lanke Binde
Follow us on

సూర్యాపేట జిల్లాలో లంకెబిందె దొరకడం కలకలం రేపుతోంది. చివ్వెంల మండలం తుల్జారావుపేట గ్రామంలోని ఓ వ్యవసాయ భూమిలో ట్రాక్టర్‌ తో దున్నుతుండగా లంకెబిందె లభించినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇదే గ్రామానికి చెందిన ఓ దళిత యువకుడు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆ భూమిలో ఇటీవల ట్రాక్టర్‌తో దున్నుతుండగా ట్రాక్టర్‌ నాగళ్లకు బిందె తగిలింది. దాంట్లో కేజీకిపైగా బంగారం ఉన్నట్లు సమాచారం.

ఆ సమయంలో ట్రాక్టర్‌ దున్నే వ్యక్తితో గ్రామానికి చెందిన మరో ఇద్దరు ఉన్నారు. బంగారం పంపకాలలో వివాదం తలెత్తినట్లుగా సమాచారం. దీంతో ఇది కాస్తా ఓ హోంగార్డు వద్దకు చేరింది. హైదరాబాద్‌లో పని చేస్తున్న హోంగార్డు ఆ సమస్యను చాలా ఈజీగా పరిష్కరిచినట్లుగా తెలుస్తోంది. అతని మధ్యవర్తిత్వంలో పంపకాలు జరిగినట్లు తెలిసింది. ముగ్గురిలో ఇద్దరికి రూ.10లక్షలు, మరొకరికి రూ.14 లక్షలు ఇచ్చి మిగతా బంగారం మరో వ్యక్తి, సదరు హోంగార్డు అమ్ముకునేలా నిర్ణయించుకున్నారని గ్రామస్థులు అనుకుంటున్నారు. ఈ విషయం ఈ నోటా ఆ నోటా పోలీసులకు తెలిసి, నిజానిజాలు నిగ్గుతేల్చే పనిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి : Kongu Nadu: ప్రత్యేక రాష్ట్రం దిశగా “కొంగునాడు”.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర సర్కార్..

కుర్రాళ్ళ గుండెలకు గిలిగింతలు పెడుతున్న బుల్లితెర బ్యూటీ క్వీన్ శ్రీముఖి