KTR Son Himanshu: సీఎం కేసీఆర్ దంపతుల అద్భుత చిత్రం.. ఫిదా అయిపోయిన కల్వకుంట్ల హిమాన్షు..

KTR Son Himanshu: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన సతీమణి శోభా దంపతుల...

KTR Son Himanshu: సీఎం కేసీఆర్ దంపతుల అద్భుత చిత్రం.. ఫిదా అయిపోయిన కల్వకుంట్ల హిమాన్షు..

Updated on: Jun 03, 2021 | 2:54 PM

KTR Son Himanshu: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన సతీమణి శోభా దంపతుల పెన్సీల్ స్కెచ్ పెయింటింగ్ పట్ల వారి మనమడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు సంతోషం వ్యక్తం చేశారు. పెయింటింగ్ అద్భుతంగా ఉందంటూ సంబరపడిపోయారు. పెయింటింగ్ గీసిన వారికి హిమాన్షు థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఆ ఫోటోను హిమాన్షు ట్వీట్ చేశారు.

ఈ పెన్సీల్ స్కెచ్ పెయింటింగ్‌ను కరీంనగర్ జిల్లాకు చెందిన కలికోట వెంకటాచారి వేశారు. పెన్సీల్‌తో గీసిన ఈ ఆర్ట్‌ను తొలుత కలికోట వెంకటాచారి ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఆ తరువాత యర్రోజు చందు అనే వ్యక్తి ఆ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్, ఆయన తనయుడు హిమాన్షుకు ట్యాట్ చేస్తూ రీట్వీట్ చేశారు. దాంతో ఆ పెన్సీల్ ఆర్ట్ కాస్తా హిమాన్షు కంట పడటంతో వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ పెయింట్ అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. ఆ పెయింటింగ్‌ను హిమాన్షు సైతం రీట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణ శోభ చిరునవ్వులు చిందిస్తూ ముచ్చటిస్తున్నట్లుగా ఉన్న ఈ పేయింటింగ్‌‌పై నిటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Himanshu Tweet:

Also read:

Anandayya Eye Drops: అనందయ్య మందుపై కొనసాగుతున్న విచారణ.. ఐ డ్రాప్స్ ఇప్పట్లో ఉండదని నివేదించిన ఏపీ సర్కార్