AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR KMM tour : కేటీఆర్ ఖమ్మం టూర్‌, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఖమ్మం బస్టాండ్‌ కు ప్రారంభోత్సవం

KTR Khammam Tour : ఖమ్మం నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త బస్టాండ్‌ భవన సమాదాయాల్ని తెలంగాణ ఐటీ శాఖా

KTR KMM tour : కేటీఆర్ ఖమ్మం టూర్‌, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఖమ్మం బస్టాండ్‌ కు ప్రారంభోత్సవం
Kmm Ktr Tour
Venkata Narayana
|

Updated on: Apr 02, 2021 | 5:52 PM

Share

KTR Khammam Tour : ఖమ్మం నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త బస్టాండ్‌ భవన సమాదాయాల్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. దీంతోపాటు, ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. టేకులపల్లిలో 60.20 కోట్ల రూపాయల బడ్జెట్ తో నూతనంగా నిర్మించిన 1004 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను మంత్రులు లబ్దిదారులకు అందజేశారు. శ్రీశ్రీ సర్కిల్ నుండి వి. వెంకటపాలెం వరకు 35 కోట్ల రూపాయిలతో ఫోర్ లైన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. మిషన్‌ భగీరథ ద్వారా 45 000 కుటుంబాలకు ఇంటింటికి నల్లాలను మంత్రులు ఇవాళ ప్రారంభించారు.

నూతన బస్టాండ్‌ ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఖమ్మం బస్ స్టేషన్ రాష్ట్రం లోనే ఆధునిక బస్ స్టాండ్ గా గుర్తింపు పొందిందని, 80 వేల చదరపు అడుగులు వైశాల్యంలో ఖమ్మంలో బస్ స్టాండ్ నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ తరువాత ఖమ్మం ఒక ప్రత్యేకత ఉండేలా అభివృద్ధి చెందుతుందని.. మనము చేసిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చెప్పే బాధ్యత కూడా మన మీదే ఉందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి ఇంకా ప్రజలకు అవసరమైన సదుపాయాలను తెలుసుకునే బాధ్యత కూడా ప్రజా ప్రతినిధులదేనని కేటీఆర్ అన్నారు.

Read also : చంద్రబాబు చెప్పీచెప్పంగానే ఎంటరైపోయిన విజయసాయి, దుకాణం మూసే ముందు డిస్కౌంట్‌ ఆఫర్లంటూ సెటైర్లు