AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చెక్‌పోస్ట్ వద్ద కారు ఆపగానే తత్తరపాటు.. ఏంటా అని చెక్ చేయగా..

దేశవ్యాప్తంగా ఎన్నికల తనిఖీలు మొన్నటివరకు విసృతంగా జరిగాయి. ప్రతి వాహనాన్ని కేంద్ర బలగాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. దీంతో కేటుగాళ్ల అక్రమ పనులకు వీలు చిక్కలేదు. దీంతో సైలెంట్ అయిపోయారు. తాజాగా మరోసారి తమ దందాను కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు.

Telangana: చెక్‌పోస్ట్ వద్ద కారు ఆపగానే తత్తరపాటు.. ఏంటా అని చెక్ చేయగా..
Police Check Post (representative image)
Ram Naramaneni
|

Updated on: Jun 14, 2024 | 3:34 PM

Share

ఏ వాహనాన్ని ఆపినా అదే వాసన గుప్పుమంటుంది. ఏ ప్రాంతాంలో తనిఖీలు చేసినా.. అదే మాల్ తారసపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా మళ్లీ జోరందుకుంది. ఎన్నికల వేళ విసృత తనిఖీల నేపథ్యంలో గమ్మునుండిపోయిన పెడ్లర్లు మరోసారి.. దందాలు షురూ చేశారు. తాజాగా అక్రమంగా పెద్ద మొత్తంలో తరలిస్తున్న గంజాయిని కొత్తగూడెం పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెం వన్​టౌన్​ పోలీసులు ​తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పట్టణంలోని అండర్​ బ్రిడ్జ్​ వద్ద ఎస్సై విజయ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారులోని వ్యక్తులు తత్తరపడుతూ కనిపంచారు. దీంతో డౌట్ వచ్చి కారును తనిఖీ చేయగా 93 ప్యాకెట్లలో 186 కేజీల గంజాయి పట్టుబడింది.  దీని విలువ దాదాపు రూ. 75లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఒరిస్సాలోని మల్కాన్​గిరి ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్​కు గంజాయి తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. నిందితులు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేటకు చెందిన భూక్యా లక్ష్మణ్, పెనుగొండ నరసింహులు, కుంచం లక్ష్మణ్​గా గుర్తించారు. తనిఖీల్లో పాల్గొన్న టాస్క్​ ఫోర్స్​ పోలీసులు, వన్​టౌన్​ పోలీసులను ఎస్పీ బి. రోహిత్​ రాజు అభినందించారు. గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ఇదే జోష్‌తో ముందుకు సాగాలని సూచించారు.

Kothagudem Police

Kothagudem Police

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..