Munugode by Poll: కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆసక్తికర సన్నివేశం.. రాజగోపాల్ రెడ్డికి కూసుకుంట్ల షేక్ హ్యాండ్..

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య విజయం దోబూచులాడుతోంది. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల..

Munugode by Poll: కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆసక్తికర సన్నివేశం.. రాజగోపాల్ రెడ్డికి కూసుకుంట్ల షేక్ హ్యాండ్..
Kusukuntla Prabhakar Reddy, Rajagopal Reddy

Updated on: Nov 06, 2022 | 11:53 AM

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య విజయం దోబూచులాడుతోంది. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. లెక్కింపు ప్రారంభానికి ముందే ఆయా పార్టీల అభ్యర్థులు నల్గొండలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆసక్తికర ఘటన జరిగింది. కుర్చీలో కూర్చొని ఉన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చారు. వారిద్దరూ కరచాలనం చేసుకోవడం ఆసక్తికర సన్నివేశంగా మారింది. కాగా.. తొలి పోలింగ్ కేంద్రం చోటుప్పల్ మండలం జై కేసారంలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. చౌటుప్పల్‌లో మొత్తం 59, 433 ఓట్లు ఉండగా.. 55, 678 ఓట్లు పోలయ్యాయి. అయితే వారు ఎవరి వైపు మొగ్గు చూపారు అనేది ఆసక్తికరం. అనంతరం సంస్థాన్ నారాయణపూర్ ఓట్లు ఉన్నాయి. కాగా మొదటి 6 రౌండ్లు కేవలం ఈ రెండు మండలాల ఓట్లు మాత్రమే ఉంటాయి. మునుగోడులో మొత్తం 15 రౌండ్లు ఏ రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. చివరి రౌండ్‌ ఫలితం మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

మరోవైపు.. రెండు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 515 ఓట్ల లీడ్ లో ఉంది. మునుగోడులో బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. రెండో రౌండ్‌లో బీజేపీ లీడ్ లో ఉంది. కారు వెనకబడింది. దీంతో బీజేపీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. రెండో రౌండ్ లో 1192 పై చిలుకు ఆధిక్యం సాధించింది. అయితే.. గతంతో పోలిస్తే ఈ సారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఈ పర్సెంటేజ్ కూడా పార్టీల్లో గుబులు రేపుతోంది. 93.1 శాతం నమోదైతే.. గతంలో 91.3 శాతం ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 2 శాతం ఓటింగ్ పెరిగింది. ఈ భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం అన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..