కొత్తగూడ పెద్ద చెరువు మత్తడిలో కొండచిలువలు.. మరోమారు ఆ జాలర్లనే హడలెత్తించింది..

|

Aug 05, 2022 | 5:50 PM

మరోమారు కొత్తగూడ మండలం వేలుబెల్లి పెద్ద చెరువు మత్తడిలో కొండచిలువ ప్రత్యక్షమైంది. దాంతో స్థానిక మత్స్యకారులు మరింత భయంతో వణికిపోతున్నారు.

కొత్తగూడ పెద్ద చెరువు మత్తడిలో కొండచిలువలు.. మరోమారు ఆ జాలర్లనే హడలెత్తించింది..
Python
Follow us on

మహబూబాబాద్‌ జిల్లాలో కొండచిలువలు హడలెత్తిస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే వలలో పడ్డ కొండచిలువలు మత్స్యకారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో కొత్తగూడ మండలంలోని వేలుబల్లి పెద్ద చెరువు మత్తడి వద్ద మత్స్యకారులకు కొండ చిలువ కనిపించింది. చెరువులో చేపలు బయటికి రాకుండా ఏర్పాటు చేసిన కంచెకు వేసిన వలలో కొండచిలువ చిక్కింది. ఇటీవల భారీ వర్షాలకు వచ్చిన వరదలకు కొట్టుకొచ్చినట్టుగా గ్రామస్తులు భావించారు. అయితే, తాజాగా మరోమారు కొత్తగూడ మండలం వేలుబెల్లి పెద్ద చెరువు మత్తడిలో కొండచిలువ ప్రత్యక్షమైంది. దాంతో స్థానిక మత్స్యకారులు మరింత భయంతో వణికిపోతున్నారు.

చెరువు మత్తడి దూకుతుండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. కాగా, వలలో చిక్కిన దాన్ని చూసి వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గతంలో కొండచిలువను చూసిన జాలర్లకే తాజాగా మరో కొండచిలువ చిక్కింది. పెద్ద చెరువులో చేపలు బయటకి రాకుండా ఏర్పాటు చేసిన కంచెకు వేసిన వలలో మరో కొండచిలువ చిక్కింది. ఈ సంఘటనతో గ్రామ ప్రజలు, మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై అటవీశాఖ అధికారులకు గ్రామ సర్పంచ్ వజ్జ వెంకటలక్ష్మి సమాచారం అందించారు.

వరుసగా కొండచిలువలు ప్రత్యక్షమవడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. రైతులు, మత్స్యకారులు జాగ్రత్త వహించాలనీ సర్పంచ్ సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి