Video: కొండా సురేఖ బర్తరఫ్.. మీసం మెలేసిన కొండా మురళీ!

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆమె భర్త కొండా మురళీ బాల్కనీ నుంచి మీసం మెలేస్తూ అభిమానులకు అభివాదం చేయడం వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Video: కొండా సురేఖ బర్తరఫ్.. మీసం మెలేసిన కొండా మురళీ!
Konda Surekha And Konda Murali

Updated on: Sep 03, 2026 | 4:51 PM

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో విబేధాలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారాయి. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే లేఖ రెడీ చేసి గవర్నర్‌కు పంపినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇంకా అధికారిక సమాచారం రాకముందే కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను బర్తరఫ్ చేయడంలో వీరి కుట్ర ఉందంటూ ఆమో ఆరోపించారు.

వీడియో చూడండి

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ బ్లాక్ మెయిల్ చేశారు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

తనకు చెప్పకుండా తనను మంత్రి పదవీ నుంచి తప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురి చేసిన ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. అయినా పార్టీని చాలా మంది తిట్టారని, కానీ నన్ను మాత్రమే కావాలని టార్గెట్ చేశారంటూ కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆమె భర్త కొండా మురళీ రియాక్ట్ అయిన తీరు ప్రస్తుతం సంచలనంగా మారింది. తన భార్య మంత్రి పదవి పోయినా ఆయన తన ఇంటి బాల్కనీ నుంచి మీసం తిప్పుతూ అభిమానులకు అభివాదం చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే మంత్రి పదవి పోయినా తాను పార్టీకి రాజీనామా చేయనని కొండా సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజలకు సేవ చేస్తానని ఆమె తెలిపారు.

వీడియో చూడండి

Loading...
Unable to load recommendations.
Follow Us