Kodangal Election Result 2023: కొడంగల్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘన విజయం.. 32వేలకు పైగా ఓట్ల మెజారిటీ..

Kodangal Assembly Election Result 2023 Live Counting Updates: కొడంగల్ నియోజకవర్గ గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. పార్టీల కంటే వ్యక్తులకే స్థానిక ఓటర్లు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేటతెల్లమవుతుంది. మొదట్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ ఉండేది. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని పట్నం నరేందర్ రెడ్డి ఓడించారు. ఈ సారి వారి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

Kodangal Election Result 2023: కొడంగల్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘన విజయం.. 32వేలకు పైగా ఓట్ల మెజారిటీ..
Kodangal
Follow us
Janardhan Veluru

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 03, 2023 | 1:19 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కొడంగల్ నియోజకవర్గం కూడా ఒకటి. రాష్ట్రంలో కొడంగల్ నియోకవర్గం (Kodangal Assembly Election) పేరు తెలియని వారు ఉండరంటే అతిసయోక్తి కాదు. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం ఇది. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించడానికి ముందుగా కొడంగల్ నియోజకవర్గం కర్ణాటకలో ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఈ నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం నారాయణపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలో ఇది ఉంది. నారాయణపేట జిల్లాలోని కోస్గి, మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి మండలాలు, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, దౌల్తాబాద్, బొమ్రాస్‌పేట, దుద్యాల్ మండలాలు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 2,36,625 మంది ఓటర్లు ఉన్నారు. 2023 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 81.96 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఈ నియోజకవర్గంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు..

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిగ్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (బీఆర్ఎస్)తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  తలపడ్డారు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. కర్ణాటకలో విద్యుత్ విషయంలో తమను అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందంటూ అక్కడి రైతులు ఎన్నికల వేళ కొడంగల్‌లో నిరసన ర్యాలీలు చేపట్టడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తుందని పట్నం నరేంద్ర రెడ్డి ధీమాగా ఉన్నారు. కొడంగల్ నా అడ్డా.. ఇక్కడ గెలుపు నాదేనంటూ రేవంత్ కూడా అదే స్థాయిలో ధీమా వ్యక్తంచేశారు.

కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే.. పార్టీల కంటే స్థానిక వ్యక్తులకే ఓటర్లు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేటతెల్లమవుతుంది. మరి కొడంగల్ దంగల్‌లో నియోజకవర్గ ప్రజలు ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డికి మళ్లీ పట్టంకట్టనున్నారా..? కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థి రేసులో నిలుస్తున్న రేవంత్ రెడ్డిని ఆదరిస్తారా? అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా.. రేవంత్ రెడ్డే పైచేయి సాధించారు.. అటు బంటు రమేష్ కుమార్‌ను బీజేపీ ఇక్కడి నుంచి బరిలో నిలపగా.. అతి తక్కువ ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. రేవంత్ రెడ్డి కొడంగల్‌తో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలోనూ బరిలో నిలిచారు.

కొడంగల్ రాజకీయ ముఖచిత్రం..

కొడంగల్ నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే.. మొదట్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ ఉండేది. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రావులపల్లి గురునాథ్ రెడ్డి ఓడిపోయారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో గురునాథ్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగినా రేవంత్ రెడ్డి జోరుకు బ్రేకులు వేయలేకపోయారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో రేవంత్ రెడ్డి (కాంగ్రెస్) 9,319 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. రావులపల్లి గురునాథ్ రెడ్డి అత్యధికంగా ఐదుసార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నందారం వెంకటయ్య మూడుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఒకప్పుడు గురునాథ్ రెడ్డి, నందారం వెంకటయ్యల మధ్యే ఈ నియోజకవర్గంలో పోరు సాగేది. ఆ తర్వాత అక్కడ రాజకీయ సమీకరణలు మారిపోయాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర