Komatireddy: కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి సునామీ.. హైకమాండ్ బుజ్జగింపుల వెనుక రహస్యం అదేనా.. రంగంలోకి దిగిన కీలక నేత..
Congress: రాజగోపాల్ రెడ్డి ని సస్పెన్షన్ చేయకుండా బుజ్జగింపులు చేయడం వెనుక ఉన్న రహస్యం ఏంటి..? ఏఐసీసీ నుండి అదిష్టానం అ కీలక నేత ని రంగంలోకి దించడానికి కారణం ఏంటీ ..? ఇంతా కి ఆ నేత హైకమాండ్ బుజ్జగింపులకి దిగివస్తారా..? అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఎం జరుగుతుంది..?
తెలంగాణ కాంగ్రెస్ కి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వణుకు పుట్టిస్తున్నాడా ..? అందుకే అధిష్టానం అయన విషయంలో వ్యూహం మార్చిందా ..? రాజగోపాల్ రెడ్డి ని సస్పెన్షన్ చేయకుండా బుజ్జగింపులు చేయడం వెనుక ఉన్న రహస్యం ఏంటి..? ఏఐసీసీ నుండి అదిష్టానం అ కీలక నేత ని రంగంలోకి దించడానికి కారణం ఏంటీ ..? ఇంతా కి ఆ నేత హైకమాండ్ బుజ్జగింపులకి దిగివస్తారా..? అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఎం జరుగుతుంది..? కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంసునామీ సృష్టిస్తోంది. పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ .. కాంగ్రెస్ ను వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గ ముఖ్య నేతలతో సంప్రదింపులు, సమాలోచనలు చేశారు. అయితే నియోజకవర్గ నేతల నుంచి మిశ్రమ స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ మారవద్దన కొందరు, రాజీనామా చేయోద్దని కొందరు.. పార్టీ కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి మీతో మేమోస్తామని కొందరు చెప్తున్నారట.
మరోవైపు రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. రాజగోపాల్ ను నిలువరించేందుకు శత విధాల ప్రయత్నిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని కాంగ్రెస్ లోనే కంటిన్యూ చేసేలా చూడాలని పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు రిపోర్టు ఇచ్చారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ ను పార్టీ లో కొనసాగించాలని కాంగ్రెస్ లోని ఒక వర్గం గట్టి పట్టుదలతో ఉంది. అందుకే ఆయన్ని నిలువరించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. రాజగోపాల్ నివాసానికి వెళ్లి సంప్రదింపులు చేశారు. తాజాగా కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసంలో చర్చించారు. రాజగోపాల్ ను పార్టీ లోనే ఉండేలా చూడాలని .. అందుకోసం చర్చలు జరిపేందుకు దూతగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి బాధ్యతలు అప్పగించారు. ఎల్లుండి (శనివారం) రాజగోపాల్ తో ప్రత్యేకంగా భేటీ కావాలని ఉత్తమ్ నిర్ణయించారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. స్వయంగా రాజగోపాల్ కు ఫోన్ చేసి ఢిల్లీకి రావాల్సిందిగా రాజగోపాల్ రెడ్డి ని కోరారు.
రాజగోపాల్ పార్టీ వీడితే నల్లగొండ జిల్లా లో పార్టీ కి చాలా నష్టం జరుగుతుందని అదిష్టానం భావిస్తోంది.. అందుకే సాధ్యమయినంతమేరకు బుజ్జగింపు పర్వానికే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుంది.. అయితే కాంగ్రెస్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..