Telangana: మందుబాబులకు ఇక పూనకాలే.! బెస్ట్ బార్ల లిస్టు వచ్చేసిందిగా..

ఈ ఏడాది దేశంలోనే అత్యుత్తమ బార్‌గా బెంగళూరుకు చెందిన బార్ స్పిరిట్ ఫార్వర్డ్ నిలిచింది. విభిన్నమైన కాక్‌టెయిల్స్, అద్భుతమైన యాంబియెన్స్‌తో ఈ బార్ జ్యూరీని మెప్పించింది. విశేషం ఏంటంటే.. రెండో స్థానాన్ని కూడా బెంగళూరుకే చెందిన సోకా బార్ కైవసం చేసుకోవడం. టాప్-5లో నిలిచిన బార్ల జాబితా ఇదే

Telangana: మందుబాబులకు ఇక పూనకాలే.! బెస్ట్ బార్ల లిస్టు వచ్చేసిందిగా..
Liquor Sales

Edited By:

Updated on: Jan 19, 2026 | 1:33 PM

వీకెండ్ వచ్చిందంటే చాలు.. కాస్త చిల్‌ అవ్వడానికి మంచి బార్ ఎక్కడుందా? అని వెతికే మందుబాబులకు క్రేజీ అప్‌డేట్ ఇది. ప్రతి ఏటా ఇచ్చే ఇండియాస్ 30 బెస్ట్ బార్స్ -2025 ర్యాంకింగ్స్ తాజాగా విడుదలయ్యాయి. అయితే ఈసారి ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఎప్పుడూ టాప్‌లో ఉండే ముంబై, ఢిల్లీ నగరాలను వెనక్కి నెట్టి దక్షిణాది నగరం బెంగళూరు అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గోవాలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ అవార్డులను ప్రకటించారు. ఈ ఏడాది లిస్ట్‌లో టాప్-5లో ఉన్న బార్లు ఏవి? మన హైదరాబాద్ పరిస్థితి ఏంటి.? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

నెం.1 బార్‌గా బార్ స్పిరిట్ ఫార్వర్డ్!

ఈ ఏడాది దేశంలోనే అత్యుత్తమ బార్‌గా బెంగళూరుకు చెందిన బార్ స్పిరిట్ ఫార్వర్డ్ నిలిచింది. విభిన్నమైన కాక్‌టెయిల్స్, అద్భుతమైన యాంబియెన్స్‌తో ఈ బార్ జ్యూరీని మెప్పించింది. విశేషం ఏంటంటే.. రెండో స్థానాన్ని కూడా బెంగళూరుకే చెందిన సోకా బార్ కైవసం చేసుకోవడం. టాప్-5లో నిలిచిన బార్ల జాబితా ఇదే..

బార్ స్పిరిట్ ఫార్వర్డ్ – బెంగళూరు

సోకా – బెంగళూరు

బార్ అవుట్రిగ్గర్ – గోవా

బాయిలర్ మేకర్ – గోవా

లేయర్ (Lair) – న్యూఢిల్లీ

హైదరాబాద్ హవా..

తెలుగు రాష్ట్రాల నుంచి మన భాగ్యనగరంలోని బార్లు కూడా ఈ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. బార్ కిన్-రూ బార్ 22వ స్థానంలో నిలిచి హైదరాబాద్ గర్వపడేలా చేసింది. రూ అనే బార్ 26వ స్థానంలో నిలిచి నగరంలోని బార్ కల్చర్ ఏ స్థాయిలో ఉందో చాటిచెప్పింది. గత ఆరేళ్లుగా సాగుతున్న ఈ అవార్డుల చరిత్రలో తొలిసారిగా టాప్-4 స్థానాల్లో ముంబై లేదా ఢిల్లీకి చెందిన ఒక్క బార్ కూడా లేకపోవడం విశేషం. ముంబైకి చెందిన పాపులర్ బార్ అమెరికానో 10వ స్థానానికి పరిమితమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 250 మందికి పైగా బార్ నిపుణులు, ఫుడ్ ఇన్ ఫ్లూయెన్సర్లు, జ్యూరీ సభ్యులు కలిసి ఈ ర్యాంకింగ్స్‌ను ఇస్తారు. డ్రింక్స్ క్వాలిటీ, సర్వీస్, ఇంటీరియర్ అక్కడ దొరికే స్నాక్స్ ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుంది.

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..