
BJP Chalo Batasingaram: ఛలో బాట సింగారం.. తెలంగాణ రాజకీయాలను మరింత హీటెక్కించింది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తలపెట్టిన ‘ఛలో బాట సింగారం’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళుతున్న బీజేపీ నాయకులను ముందుస్తు అరెస్ట్ చేసిన పోలీసులు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకున్నారు. బాట సింగారం వెళ్తున్న కిణషన్ రెడ్డిని అడ్డుకోవడంతో.. ఆయన పోలీసులపై ఫైర్ అయ్యారు. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులను నిలదీశారు. దీంతో శంషాబాద్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. బీజేపీ నేతలు – పోలీసుల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే పలువురని పోలీసులు అరెస్టు చేసిన పోలీసులు.. బాట సింగారం వెళ్లడానికి అనుమతి లేదంటూ పేర్కొంటున్నారు. చివరకు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి.. పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.
ఛలో బాట సింగారానికి పిలుపునిస్తే ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్‌లు చేస్తోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆంధ్రా పాలకులు ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు.