Statue Controversy: ఖమ్మంలో వివాదానికి దారి తీసిన విగ్రహం ఏర్పాటు.. రెండు వర్గాల మధ్య ఘర్షణ.. పరిస్థితి ఉద్రిక్తం!

|

Dec 22, 2021 | 4:21 PM

ఖమ్మంలో రెండు వర్గాల మధ్య ఓ విగ్రహం వివాదానికి దారి తీసింది. చర్చి కాంపౌండ్ సర్కిల్లో నిర్మిస్తున్న ఓ నిర్మాణం వివాదానికి కారణమైంది.

Statue Controversy: ఖమ్మంలో వివాదానికి దారి తీసిన విగ్రహం ఏర్పాటు.. రెండు వర్గాల మధ్య ఘర్షణ.. పరిస్థితి ఉద్రిక్తం!
Statue
Follow us on

Khammam Statue Controversy: ఖమ్మంలో రెండు వర్గాల మధ్య ఓ విగ్రహం వివాదానికి దారి తీసింది. చర్చి కాంపౌండ్ సర్కిల్లో నిర్మిస్తున్న ఓ నిర్మాణం వివాదానికి కారణమైంది. ఖాళీ ఉన్న ప్రాంతంలో శిలువ నిర్మాణానికి కొందరు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో ఆ నిర్మాణానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ రోడ్డు విస్తరణలో భాగంగా గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు. ఆ ప్రాంతంలో తిరిగి అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ఆందోళనలకు దిగింది బీజేపీ. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

గతంలో చర్చి కాంపౌండ్‌ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో అక్కడ తిరిగి అంబేద్కర్‌ విగ్రహాన్నే ఏర్పాటుచేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ఆ ప్రాంతంలో శిలువ నిర్మాణానికి ప్రయత్నించడం ఎమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఆందోళపకు దిగిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు పోలీసులు. రోడ్డు విస్తరణలో అంబేద్కర్‌ విగ్రహాన్ని తొలగించారు కనుక తిరిగి అక్కడ అంబేద్కర్‌ విగ్రహాన్నే ఏర్పాటు చేయాలనేది బీజేపీ నేతల వాదన. మరోవైపు వివాదస్పద ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టకపోవడతో మంచిదని స్థానికులు కోరుతున్నారు.

Read Also… Parliament Winter Session: విపక్ష సభ్యుల నిరసనల మధ్య పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా