Telangana: సంక్రాంతి లక్కీ డ్రా.. రూ.500కే.. రూ.30లక్షల ప్లాట్.. సీన్‌ కట్‌చేస్తే..

సంక్రాంతి మెగా బంపర్ ఆఫర్.. మీ దగ్గర 500 రూపాయలు ఉన్నాయా.. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ లక్కీ డ్రాలో పాల్గొని 30 లక్షల విలువైన ప్లాట్ పొందండి అంటూ జనాలు నుంచి లక్షల రుపాయలు కాజేసింది ఓ ముఠా. తీరా ప్లాన్ బెడిసి కొట్టి అడ్డంగా పోలీసులకు దొరికిపోయి జైల్లో ఊసలు లెక్కెడుతోంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.

Telangana: సంక్రాంతి లక్కీ డ్రా.. రూ.500కే.. రూ.30లక్షల ప్లాట్.. సీన్‌ కట్‌చేస్తే..
Tg News

Edited By:

Updated on: Nov 21, 2025 | 6:14 PM

ఈజీ మని కోసం అలవాటు పడిన కేటుగాళ్లు జనాలను ఎలా బోల్తా కోట్టించాలా అని రోజుకో కొత్త రకం వ్యూహాలు రచిస్తున్నారు. జనాలు కూడా వారిని గుడ్డిగా నమ్మి నిండా మునుగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. సంక్రాంతి మెగా బంపర్ ఆఫర్.. అంటూ.. మీ దగ్గర రూ. 500 ఉంటే చాలు లక్కీ డ్రాలో పాల్గొని రూ. 30 లక్షల విలువైన ప్లాట్ పొందండి అంటూ జనాలు నుంచి లక్షల రుపాయలు కాజేసింది. కానీ ప్లాన్ బెడిసి కొట్టి అడ్డంగా పోలీసులకు బుక్కైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలస్యం విజయ్ కుమార్ అనే వ్యక్తి కొంది మందితో కలిసి సంక్రాంతి బంపర్ ఆఫర్ పేరిట ఒక లక్కీ డ్రాను ఏర్పాటు చేశారు. రూ. 500 పెట్టి ఈ లక్కీ డ్రాలో పాల్గొంటే రూ. 30 లక్షల విలువైన ప్లాటు సొంత చేసుకోవచ్చని ప్రాచరం చేశారు. అయితే ఇది ఫేక్ అని గ్రహించిన పోలీసులు.. నిర్వాహకుడు విజయ్ కుమార్‌తో సహా అతనికి సహకరిస్తున్న 13 మంది ఏజెంట్స్ ను అరెస్ట్ చేశారు.

అయితే వాస్తవానికి ఆ స్థలం విలువ అంత లేకపోయిన ముద్దాయి IKF హోమ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్యాంక్ నుండి తనకా లోన్ తీసుకుని, ల్యాండ్ ని 20 లక్షల రూపాయలకు కొన్నట్లు చూపించి రిజిస్ట్రేషన్ చేపించాడు. లక్కీ డ్రాలో చూపించిన ల్యాండ్‌లో ఒక నాలుగు గదుల రేకుల షెడ్డు మాత్రమే ఉంది. ఈ ల్యాండ్ ఎక్కువ రేటు ఉందని నమ్మించాలని ముందు నుంచి పథకం వేసుకున్న విజయ్.. సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో కొన్ని పాంప్లెట్స్, పుస్తకాలు ప్రింట్ చేయించి.. లక్కీడ్రాకు ఎలాంటి అనుమతి తీసుకోకుండా ప్రచారం చేశాడు.

ఈ లక్కీ డ్రా గురించి ప్రచారం చేసి.. టోకెన్లు అమ్మడానికి 13 మంది ఏజెంట్స్ ను పెట్టుకున్నాడు. ఒక్క టోకెన్‌పై రూ.50 కమిషన్ ఇస్తానని వాళ్లకు చెప్పాడు. దీంతో వాళ్లు ఈ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. విజయ్‌తో పాటు అతనికి సహకరిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 27 లక్కీ డ్రా పుస్తకాలు, 533 రిసిప్టులు ,సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఇలాంటి మోసపూరిత ప్రచారాలను జనాలు నమ్మొద్దని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.