Khammam Politics: మేకపోతు గాంభీర్యానికి భయపడం.. పార్టీ నుంచి వెళ్లిపో.. పొంగులేటికి ఎమ్మెల్యే రేగా స్ట్రాంగ్‌ కౌంటర్..

|

Jan 28, 2023 | 8:09 AM

పొంగులేటి.. కారులో ప్రయాణం చేయరు. అలాగని దిగి పక్కకు వెళ్లిపోరు. సొంత పార్టీతో పాటు, నేతలపై విమర్శలు చేస్తూ ఇటీవల కాలంలో రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. ఆయనకు ధీటుగా బీఆర్‌ఎస్ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. దీంతో ఖమ్మంలో రాజకీయ యుద్ధం మొదలైంది.

Khammam Politics: మేకపోతు గాంభీర్యానికి భయపడం.. పార్టీ నుంచి వెళ్లిపో.. పొంగులేటికి ఎమ్మెల్యే రేగా స్ట్రాంగ్‌ కౌంటర్..
Khammam Politics
Follow us on

ఖమ్మం రాజకీయాల్లో హైవోల్టేజ్ హీట్‌ కంటిన్యూ అవుతోంది. బీఆర్ఎస్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. కొన్ని రోజులుగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న పొంగులేటి.. ప్రభుత్వంపై నేరుగానే కామెంట్లు చేస్తున్నారు. ఆయనకి కౌంటర్‌గా బీఆర్‌ఎస్ నేతలు బదులిస్తున్నారు. BRS అసమ్మతి నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే వాళ్లని చూసి భయపడే పరిస్థితి లేదన్నారు. దమ్ముండే పొంగులేటి పార్టీ నుంచి బయటకు వెళ్లి మాట్లాడాలని రేగా కాంతారావు ఛాలెంజ్ చేశారు.

కేసీఆర్ బీఫామ్ ఇచ్చిన వ్యక్తిని వైరాలో ఓడించిన వ్యక్తి పొంగులేటి అంటూ మండిపడ్డారు. మేము ఎవరినీ బయటకు పంపించే ప్రయత్నం చేయడం లేదు, కానీ పార్టీ లైన్ దాటి వెళ్తే తప్పకుండా చర్యలు ఉంటాయంటూ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో 10 సీట్లను గెలిచే సత్తా బీఆర్ఎస్‌కు ఉందన్నారు ఎమ్మెల్యే రేగా కాంతారావు. తనను టార్గెట్ చేసి ఓడించేంత దమ్ము ఎవరికి లేదంటూ రేగా ప్రకటించారు. పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉన్నప్పుడు దాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తాం. చేతులు ముడుచుకొని కూర్చోలేమన్నారు. ఏదైనా ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని రేగా కాంతారావు స్పష్టంచేశారు.

ఇటీవల ఇల్లందులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. BRS ప్రభుత్వం ఇంకా రెండు మూడు నెలులు మాత్రమే ఉంటుందన్నారు. తమ అనుచరులను ఇబ్బంది పెడుతున్న వాళ్లు.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేగా కాంతారావు కౌంటర్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..