అర్ధరాత్రి కారులో వస్తారు.. సైలెంట్‌గా పనికానిస్తారు.. డ్యామిట్, అప్పుడే కథ అడ్డం తిరిగింది

| Edited By: Shaik Madar Saheb

Aug 26, 2024 | 3:36 PM

దొంగలంటే ఇళ్లలోనూ, దుకాణాల్లోనూ, బ్యాంకులలోను, దేవాలయాల్లోనూ చోరీలకు పాల్పడటం మనం చాలాసార్లు చూసుంటాం.. కానీ వీరి కథ మాత్రం వేరు.. మంచిగా రెడీ అవుతారు.. దర్జాగా కారులో తిరుగుతుంటారు.. కానీ.. చేసే పని మాత్రం దొంగతనం.. అదికూడా మేక, గొర్రెపోతులను ఎత్తుకుపోతుంటారు.. అలా మేకపోతులను ఎత్తుకుపోతూ దొంగల ముఠా పోలీసులకు చిక్కింది.

అర్ధరాత్రి కారులో వస్తారు.. సైలెంట్‌గా పనికానిస్తారు.. డ్యామిట్, అప్పుడే కథ అడ్డం తిరిగింది
Crime News
Follow us on

దొంగలంటే ఇళ్లలోనూ, దుకాణాల్లోనూ, బ్యాంకులలోను, దేవాలయాల్లోనూ చోరీలకు పాల్పడటం మనం చాలాసార్లు చూసుంటాం.. కానీ వీరి కథ మాత్రం వేరు.. మంచిగా రెడీ అవుతారు.. దర్జాగా కారులో తిరుగుతుంటారు.. కానీ.. చేసే పని మాత్రం దొంగతనం.. అదికూడా మేక, గొర్రెపోతులను ఎత్తుకుపోతుంటారు.. అలా మేకపోతులను ఎత్తుకుపోతూ దొంగల ముఠా పోలీసులకు చిక్కింది.. కారులో వచ్చి గొర్రెలు, మేకలు దొంగతనం చేసి విక్రయిస్తున్న దొంగల ముఠాను ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో కారులో వచ్చి ఓ ఇంటి ఆవరణంలో ఉన్న రెండు గొర్రెలు ఒక మేకపోతును అపహరించారు.. అలా దొంగతనం చేసి తమ కారులో మూడు జీవాలను తరలిస్తుండగా వల్లభి సమీపంలో పెట్రోలింగ్ పోలీసులు అనుమానంతో కారును ఆపారు.. జీవాల గురించి ఆరాతీయగా.. పొంతన లేని సమాధానం చెప్పారు.. దీంతో పోలీసులు దొంగలను అదుపులోకి తీసుకున్నారు.

బాణాపురంలో దేవేంద్రం అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు ఇంటి ముందు కట్టేసి ఉన్న 2గొర్రెలు ఒక మేకపోతును కారులో తీసుకుని వెళ్లారు.పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కారు కనిపించడంతో ఆపి తనిఖీ చేయగా.. అందులో గొర్రెలు ఉండటంతో అనుమానంతో అదుపులోకి తీసుకున్నామని.. ఆ తర్వాత విచారణలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి..

కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై దొంగతనం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గొర్రెలు, మేకపోతును యజమానికి అప్పగించారు.. గతంలో కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..