Telangana: ఇంగ్లీష్ టీచర్ ఎంత పనిచేసింది.. స్కూల్‌లో పిల్లలకు పాఠాలు చెప్పకుండా..
ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. కానీ, చేసేదేమో ఇన్‌స్టా రీల్స్.. ప్రైవేట్ విద్యాసంస్థలకు, వ్యాపార సంస్థలకు పమోషన్స్.. ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఆమెనే.. ఏం తెలియనట్లు ఇలా వ్యవహరించింది. సీన్ కట్ చేస్తే.. ప్రభుత్వం దిమ్మతిరిగేలా షాకిచ్చింది.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గౌతమిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.. ఈ షాకింగ్ తెలంగాణలోని ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

ఖమ్మం మామిళ్ళగూడెం ప్రభుత్వ హై స్కూల్ ఉపాధ్యాయురాలు గౌతమిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.. ప్రైవేట్ విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలకి ప్రమోషన్స్, ఇన్ స్టా రీల్స్ చేస్తున్న టీచర్ గౌతమిపై ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. ఓ ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్ ప్రమోషన్.. అలాగే స్కూల్ సమయంలో రీల్స్ చేస్తోందని గతంలో హెచ్చరించినా తీరు మార్చుకోలేదని పేర్కొన్న డీఈవో.. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంగ్లీష్ టీచర్ గౌతమి.. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్లు చేయడంతో పాటు పాఠశాల సమయంలో రీల్స్ చేయడంతో పలుమార్లు ఉన్నతాధికారులు హెచ్చరించారు. అయినా ఆ ఉపాధ్యాయురాలు తన తీరు మార్చుకోకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని పేర్కొన్నారు..
అసలేం జరిగిందంటే..
ఖమ్మం మామిళ్లగుడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న భూక్యా గౌతమి కొన్ని నెలలుగా నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల అడ్మిషన్లకు సంబంధించిన ప్రమోషన్లు చేస్తూ.. తన ప్రభుత్వ పాఠశాల విధులను నిర్లక్ష్యం చేస్తోంది. అలాగే పాఠశాల సమయంలో రీల్స్ చేస్తూ సమయం వృథా చేస్తోందనే అంశాలపై గతంలో పలు మార్లు హెచ్చరించారు.. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
View this post on Instagram
ఒక్కఛాన్స్ ఇవ్వండి ప్లీజ్..
సస్పెన్షన్ పై టీచర్ గౌతమి స్పందించారు.. తాను తెలియక చేశానని.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ కోరారు.. తాను ఇంకెప్పుడు ఇలా చేయనంటూ కన్నీరుమున్నీరయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
