సువాసన…అంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. పరిమళాలు గుమ గుమ లాడే సువాసనలు అంటే ఎవ్వరైనా ఫిదా అవుతారు. పువ్వులు…కాయలు…ప్రత్యేక సుగంధాలను వెదజల్లుతాయి. కానీ మనం తినే రైస్ కూడా సెంటెడ్ టైప్ వరి పంట దిగుబడి నిస్తుంది అంటే నమ్మశక్యంగా లేకున్నా నమ్మల్సిందే మరి. ఇంతకు పరిమళాలు వెదజల్లే సేంటెడ్ టైప్ దేశియవాళీ కొత్త వరి వంగడాన్ని క్రాసింగ్ పద్దతిలో సృష్టించాడు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు కు చెందిన జాతీయ స్థాయి ఆదర్శ రైతు. అతనే గొర్ల సత్యనారాయణ రెడ్డి.
విలువైన ప్రొటీన్లుతో కూడిన అద్భుతమైన దేశియవాళీ బ్లాక్ రైస్ వరి వంగడంతో అత్యంత నాణ్యమైన సన్న రకం సెంటెడ్ దేశీయవాళీ వరి వంగడం తో GSR గొర్ల సత్యనారాయణ రెడ్డి వ్యవసాయ పరిశోధన కేంద్రం లో క్రాసింగ్ పద్ధతితో కొత్త రకం వరి వంగడాన్ని సృష్టించాడు. ఈ వరి వంగడానికి SS – 41 అనే రకం వరి వంగడం. దీనికి మణిరత్నం వరి వంగడంగా కూడా నామకరణం చేశాడు. ఈ కొత్త రకం వరి వంగడం 140 రోజుల కాలపరిమితి లో పంట దిగుబడినిస్తుంది. ఎకరాకు 45 నుంచి 50 బస్తాలు పైగానే దిగుబడి వస్తుందని ఈ వంగడాన్ని తయారు చేసిన ఆదర్శ రైతు GSR వివరించారు.
దాదాపు 40 ఏళ్లుగా వ్యవసాయ రంగంలో అనుభవం సాధించడమే కాకుండా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మార్కెట్ లోకి 03 రకాల వరి వంగడాలను విడుదల చేసినట్టు తెలిపారు. ప్రకృతి వైపరిత్యాలు నుంచి అదే విధంగా వరి పైరుకు వచ్చే చీడ, తెగుళ్లు నుంచి రైతును కాపాడుతూ.. వరి పంట దెబ్బ తిన కుండా రైతుకు తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడి వచ్చి రైతు అప్పులు పాలు కాకూడదనే ఉద్దేశంతోనే తాను నిత్యం వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో శ్రమిస్తానని చెప్పుకొచ్చారు.
ఎన్ని డిగ్రీలు చదివినా, పీజీలు చేసినా దేశానికి అన్నం పెట్టే రైతు లేకుంటే ఆ లోటు మాటల్లో చెప్పలేనిది అని అన్నారు. భూమాతను నమ్మి…నాగలితో భూమిని ధున్ని వ్యవసాయం చేయడం ఎంతో అదృష్టం ఉండాలి. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా రైతు తట్టు కునేలా కొత్త వరి వంగడాలు అందుబాటులోకి రావాలని, అందుకు వ్యవసాయ పరిశోధకులు శ్రమించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను ఐదేళ్లుగా కష్టపడితే ఇప్పుడు ఈ SS -41 రకం కొత్త వరి వంగడాలు విజయవంతంగా సాగు చేసి చూపించగలిగాను అని అన్నారు. ఈదురు గాలులను తట్టుకునేవిధంగా కొత్తరకం వరి వంగడం బలంగా ఉంటుంది. అలాగే నాలుగు అడుగులు ఎత్తు ఎదుగుతుందని, అధిక దిగుబడి ఇస్తుందని, బ్లాక్ రైస్ వంగడం లో ఉండే ప్రొటీన్లు ఈ వంగడం లో ఉంటాయని, సుగంధాన్ని వెదజల్లడం ఈ సన్నని వరి వంగడం ప్రత్యేకం అని ఆదర్శ రైతు గొర్ల సత్యనారాయణ రెడ్డి చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..