AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాడు ఒకే ఒక్క విద్యార్థిని.. నేడు అదే స్కూలుకు బ్రాండ్ అంబాసిడర్..!

నాడు స్కూలు లో ఒకే ఒక విద్యార్థిని.. ఒక్క విద్యార్థితో నడుస్తున్న ఆ ప్రభుత్వ పాఠశాలను మూతపడకుండా కాపాడి నిలిపింది. నేడు అదే పాఠశాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. నాడు ఆ పాఠశాలలో ఒకే ఒక విద్యార్థిని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ సహకారంతో ఆ పాఠశాలకు మహర్దశ కలిగించింది. ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ ఆ పాఠశాలకు మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను తీర్చిదిద్దారు.

నాడు ఒకే ఒక్క విద్యార్థిని.. నేడు అదే స్కూలుకు బ్రాండ్ అంబాసిడర్..!
Government School
N Narayana Rao
| Edited By: |

Updated on: Jun 14, 2025 | 3:43 PM

Share

నాడు స్కూలు లో ఒకే ఒక విద్యార్థిని.. ఒక్క విద్యార్థితో నడుస్తున్న ఆ ప్రభుత్వ పాఠశాలను మూతపడకుండా కాపాడి నిలిపింది. నేడు అదే పాఠశాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. నాడు ఆ పాఠశాలలో ఒకే ఒక విద్యార్థిని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ సహకారంతో ఆ పాఠశాలకు మహర్దశ కలిగించింది. ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ ఆ పాఠశాలకు మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను తీర్చిదిద్దారు. దీంతో బడిబాట కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు గ్రామస్తులను ఒప్పించి 12 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించడంతో ఆ పాఠశాలకు పూర్వవైభవం సంతరించుకుంది. ఆ పాఠశాలలో చదివే విద్యార్థినిని బ్రాండ్ అంబాసిడర్‌గా స్కూలు గోడలపై చిత్రాన్ని సైతం తీర్చిదిద్దారు.

ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి గ్రామం ప్రాథమిక పాఠశాలకు జిల్లా కలెక్టర్ సహకారంతో మహర్దశ సంతరించుకుంది. గత సంవత్సరం ఒకే ఒక విద్యార్థినితో నడిచిన పాఠశాల నేడు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ సహకారంతో పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించారు. పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది విద్యార్థులను ఆకర్షించే విధంగా పాఠశాల గోడలపై పలు చిత్రాలను వేయించారు. కోతుల బెడద నుంచి కాపాడేందుకు స్కూల్ గోడలపై సోలార్ ఫెన్సింగ్ వేయించారు. కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పాఠశాలలో ప్రారంభం రోజు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు కలిసి 12 మంది విద్యార్థులును చేర్పించారు.

నారపనేనిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గత సంవత్సరం ఒకే ఒక విద్యార్థినితో ఒకే ఒక టీచర్ తో పాఠశాలను నడిపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయకూడదని ఆదేశాలు ఇవ్వటంతో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ సహకారంతో కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించడంతో గ్రామస్తుల సహకారంతో 12 మంది విద్యార్థులను చేర్పించడం జరిగిందని విద్య శాఖ అధికారి తెలిపారు. గ్రామంలోని విద్యార్థులంతా ప్రైవేట్ పాఠశాలలకు ఆకర్షితులవటంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కొరత ఏర్పడింది. జిల్లా కలెక్టర్ సహకారంతో పాఠశాలను తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు దీంతో గ్రామస్తులు సహకారంతో 12 మంది విద్యార్థులను స్కూల్లో చేర్పించడం జరిగిందని అధికారులు తెలిపారు.

మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేకపోయినా తమ కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ఉద్దేశంతోటే కుమార్తె చేర్పించామని విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపారు. ఒక్కరి కోసం అయినా స్కూలును నడిపించాలని మీడియా ద్వారా పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో జిల్లా కలెక్టర్ సహకారంతో స్కూలును నడిపించారని తెలిపారు. ఈ సంవత్సరం జిల్లా కలెక్టర్ సహకారంతో 12 మంది విద్యార్థులు పాఠశాలలో నూతనంగా చేరటం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

పాఠశాలలో గత సంవత్సరం ఒక్కదానినే నాలుగవ తరగతి చదువుకున్నానని విద్యార్థిని తెలిపింది. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే మంచి విద్యను అందిస్తారని తెలిపింది. జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ సహకారంతో తమ స్కూలును కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించారని, దానివలన ఈ సంవత్సరం ప్రారంభంలో మరో 11 మంది విద్యార్థులు కొత్తగా పాఠశాలలో చేరారని తెలిపింది. కొత్తగా విద్యార్థుల చేరటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..