Telangana: గణేషుడి నిమజ్జనం వేడుకల్లో దుమ్ము రేపిన ఖమ్మం కలెక్టర్.. ఆర్ఆర్ఆర్ మాస్ డ్యాన్స్‌తో ఇరగదీశారు..

Telangana: మ్యూజిక్ వినిపిస్తే చాలు చాలా మందికి ఆటోమాటిక్‌గా కాళ్లు, చేతులు ఆడేస్తుంటాయి. డ్యాన్స్ చేయాలనిపిస్తుంటుంది. కానీ, కొందరు మొహమాటం కొద్ది తమను..

Telangana: గణేషుడి నిమజ్జనం వేడుకల్లో దుమ్ము రేపిన ఖమ్మం కలెక్టర్.. ఆర్ఆర్ఆర్ మాస్ డ్యాన్స్‌తో ఇరగదీశారు..
Collector
Follow us

|

Updated on: Sep 05, 2022 | 5:50 PM

Telangana: మ్యూజిక్ వినిపిస్తే చాలు చాలా మందికి ఆటోమాటిక్‌గా కాళ్లు, చేతులు ఆడేస్తుంటాయి. డ్యాన్స్ చేయాలనిపిస్తుంటుంది. కానీ, కొందరు మొహమాటం కొద్ది తమను తాము కంట్రోల్ చేసుకుంటారు. ఇంకొందరు.. మొహమాటాన్ని పక్కనపెట్టి తమదైన స్టైల్‌ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీస్తారు. తాజాగా ఓ జిల్లా కలెక్టర్ కూడా తనదైన మాస్ స్టెప్పులతో సందడి చేశారు. గణేషుడి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నేటికి ఐదు రోజులు పూర్తయ్యాయి. చాలా మంది ఐదు రోజుల్లో వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కూడా వినాయకుడిని ప్రతిష్ఠించగా.. ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అయితే, అంతకు ముందు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు కలెక్టర్, ఆయన కుటుంబ సభ్యులు, క్యాంపు కార్యాలయ సిబ్బంది. కారుపై వినాయకుడిని ఊరేగిస్తూ.. డీజే పెట్టి బరాత్ తీశారు. ఆ బరాత్‌లో కలెక్టర్ పీవి గౌతమ్ రచ్చ చేశారు. తన హోదాను పక్కన పెట్టి మరీ అదిరిపోయే స్టెప్పులేశారు. భార్యా పిల్లలు, సిబ్బందితో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు చిందేశారు. గణనాథుని నిమజ్జనం వేళ సిబ్బందితో కలిసి కలెక్టర్‌ కూడా డాన్సులేయడంతో.. అక్కడున్నవారంతా సంబరాల్లో మునిగితేలారు. కాగా, కలెక్టర్ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..