Telangana High Court: ఖమ్మం కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. క్షమాపణ చెప్పిన కలెక్టర్‌

|

Mar 10, 2021 | 9:36 PM

Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ క్షమాపన చెప్పారు. కోర్టు దిక్కణ కేసు విచారణలో సీజే జస్టిస్‌ హిమా కోహ్లి...

Telangana High Court: ఖమ్మం కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. క్షమాపణ చెప్పిన కలెక్టర్‌
Telangana High Court
Follow us on

Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ క్షమాపన చెప్పారు. కోర్టు దిక్కణ కేసు విచారణలో సీజే జస్టిస్‌ హిమా కోహ్లి ధర్మాసనం ఎదుట ఆయన హాజరయ్యారు. ప్రభుత్వ పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న వినతి పత్రాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఖమ్మం కలెక్టర్‌ భేఖాతర్‌ చేశారు. దీంతో కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో హైకోర్టు సింగిల్‌ జడ్జి కోర్టు ధిక్కరణ శిక్ష విధించారు. దీనికి రూ.500 జరిమానా చెల్లించాలని ఆదేశించారు. సింగిల్‌ జడ్జి తీర్పు విషయంలో కలెక్టర్‌ దాఖలు చేసిన అప్పీలుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. దీంతో ఆయన క్షమాపణ చెప్పడంతో కోర్టు ధిక్కరణ శిక్షను హైకోర్టు రద్దు చేసింది..

కాగా, దీనిపై ఈ నెల3న విచారణ చేపట్టిన హైకోర్టు.. కోర్టు ధిక్కరణ అప్పీలులో పేర్కొన్న అంశాలనే కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించరాదో చెప్పాలంటూ కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ న్యాయవాదికి కూడా హైకోర్టునోటీసులు జారీ చేసింది. ఆరోపణలను తొలగించడంతో పాటు బేషరతుగా క్షమాపణతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించడంతో హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే 3న విచారించిన కోర్టు 10కి వాయిదా వేయడంతో నేడు కోర్టులో విచారణ జరిగింది.

Andhra Pradesh Jobs: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. APPSC ద్వారా 8402 ఉద్యోగాల భర్తీకి మంత్రి ప్రకటన..