Telangana: ఖమ్మం బీఆర్ఎస్‌లో చిత్రవిచిత్ర పరిణామాలు.. మాజీ ఎమ్మెల్యే రాసలీల ఫోటోలు వైరల్..

|

Aug 20, 2023 | 1:39 PM

ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాములు నాయక్‌ గత ఎన్నికల్లో రెబల్‌గా పోటీ చేసి మదన్‌లాల్‌పై గెలిచారు. ఆయన ఎన్నికల్లో గెలిచాక బీఆర్ఎస్‌లోకి వచ్చారు. రాములు నాయక్‌ పొంగులేటి వర్గంతో కలిసి అప్పుడు పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు పొంగులేటి వెళ్లినా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకత్వం చేయించిన సర్వేలో రాములు నాయక్‌పై వ్యతిరేకత వచ్చిందని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే తన ప్రత్యర్థుల్ని రాములు నాయక్‌ టార్గెట్‌ చేశారని మదన్ లాల్ వర్గం ఆరోపిస్తోంది. ప్రస్తుతం రాములు నాయక్‌కి పోటీ అంటే మదన్‌లాల్‌ నుంచే ఉందని, అందుకే ఆయన క్యారెక్టర్‌ను డీగ్రేడ్‌ చేసేలా ఈ ఫొటోలు వైరల్‌ చేశారని..

Telangana: ఖమ్మం బీఆర్ఎస్‌లో చిత్రవిచిత్ర పరిణామాలు.. మాజీ ఎమ్మెల్యే రాసలీల ఫోటోలు వైరల్..
Ex MLA Madanlal
Follow us on

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌‌ను వివాదం చుట్టుముట్టింది. ఆయన ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే, ఈ ఫోటోలు మార్ఫింగ్ చేసినవంటూ కొట్టిపారేశారు మదన్‌లాల్ అనుచరులు. ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం కావాలనే వీటిని వైరల్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. మదన్ లాల్ వైరా నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. మరి మదన్ లాల్ ఆరోపిస్తున్నట్లు నిజంగానే ఆయన్ను టార్గెట్ చేశారా? రాసలీలల ఫోటోలు అంటూ వైరల్ చేస్తోంది ఎవరు? ఈ వ్యవహారం ఇప్పుడు నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

అయితే, ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాములు నాయక్‌ గత ఎన్నికల్లో రెబల్‌గా పోటీ చేసి మదన్‌లాల్‌పై గెలిచారు. ఆయన ఎన్నికల్లో గెలిచాక బీఆర్ఎస్‌లోకి వచ్చారు. రాములు నాయక్‌ పొంగులేటి వర్గంతో కలిసి అప్పుడు పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు పొంగులేటి వెళ్లినా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకత్వం చేయించిన సర్వేలో రాములు నాయక్‌పై వ్యతిరేకత వచ్చిందని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే తన ప్రత్యర్థుల్ని రాములు నాయక్‌ టార్గెట్‌ చేశారని మదన్ లాల్ వర్గం ఆరోపిస్తోంది. ప్రస్తుతం రాములు నాయక్‌కి పోటీ అంటే మదన్‌లాల్‌ నుంచే ఉందని, అందుకే ఆయన క్యారెక్టర్‌ను డీగ్రేడ్‌ చేసేలా ఈ ఫొటోలు వైరల్‌ చేశారని ఆరోపిస్తున్నారు మదన్ లాల్ అనుచరులు. అయితే, ఈ వ్యవహారంతో తమకు సంబధం లేదని ఎమ్మెల్యే రాములు నాయక్‌ వర్గం అంటుంటే.. ఇది వాళ్ల పనేనని మదన్‌లాల్‌ వర్గం ఆరోపిస్తోంది. మరి ఈ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

ఇల్లందు బీఆర్ఎస్‌లో విభేదాలు..

ఇదిలాఉంటే.. ఇల్లందు బీఆర్ఎస్‌లో విభేదాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కు వ్యతిరేకంగా అసమ్మతి చెలరేగింది. హరిప్రియకు వ్యతిరేకంగా మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి నివాసంలో అసమ్మతి నేతలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దంటూ నేతలు డిమాండ్ చేశారు. హరిప్రియకు కాకుండా కొత్త వారికి టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని నేతలు హామీ ఇస్తున్నారు. ఇదిలాఉంటే.. అసమ్మతి నేతలపై ఎమ్మెల్యే హరిప్రియ వర్గం విమర్శలు గుప్పిస్తోంది. మున్సిపల్ చైర్మన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసమ్మతి సమావేశాలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్‌ను దెబ్బతీసే చర్యలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

రసవత్తరంగా కొత్తగూడెం రాజకీయం..

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్తగూడెం రాజకీయ మరింత రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ టిక్కెట్ కోసం ముగ్గురు నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. తనకే టిక్కెట్ అని సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అంటుండగా.. తనకే టిక్కెట్ వస్తుందని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ప్రచారం చేసుకుంటున్నారు. వనమా, జలగం మధ్యలో డీహెచ్ గడల శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలోని సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గడప గడపకు గడల కార్యక్రమాన్ని ప్రారంభించారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు. గడప గడపకు తిరుగుతూ మహిళలకు శ్రావణ మాసం పసుపు, కుంకుమ కానుకలను గడల అందజేశారు. రాజకీయాలు అంటే సేవ..సేవ అంటే రాజకీయాలు అంటున్నారు డీహెచ్ గడల శ్రీనివాసరావు. జీఎస్ఆర్ ట్రస్ట్ తరఫున గడప గడపకు విద్య, వైద్యం ఉపాధి కార్యక్రమాలను అందించడమే లక్ష్యమన్నారు. కొత్తగూడెం ప్రజల ఆశీస్సులు కావాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..