CM KCR Birthday: ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు.. కోళ్లు పంపిణీ చేసిన మేయర్.. ఎక్కడంటే..?
ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (CM KCR) పుట్టినరోజు సందర్భంగా ఊరూవాడా సంబరాలు జరుగుతున్నాయి.
ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (CM KCR) పుట్టినరోజు సందర్భంగా ఊరూవాడా సంబరాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు(TRS) రక్తదాన శిబిరాలు, అన్నదానాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాదు జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, నిలయంలో వృద్ధులకు పండ్లు , బ్రెడ్లు , బెడ్ షీట్లు పంపిణీ చేశారు. అనంతరం కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. పలు గ్రామపంచాయతిలలో మొక్కలు నాటి , కేక్ కట్ చేసి జన్మదిన సందర్భంగా చిన్నారులకు కేక్ తినిపించారు. అయితే కరీంనగర్‌లో ఆ పార్టీ నేతలు వినూత్నంగా ఆలోచన చేశారు. కోళ్లను పంపిణీ చేశారు. ఇందుకు అనుగూనంగా స్థానికంగా ఉండే పేదవారికి కోళ్లను పంపిణీ చేశారు. కరీంనగర్ 25 వ డివిజన్‌కు చెందిన ఎడ్ల అశోక్ సరిత ఆధ్వర్యంలో కోళ్లు పంపిణీ చేశారు. ఆ కోళ్లను నగర మేయర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు చేతుల మీదుగా అందిరికి పంచిపెట్టారు.
జిల్లాలు, రాష్ట్రంలోనే కాదు పొరుగున్న ఒడిషా రాష్ట్రంలో కూడా కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు. పూరీ సముద్ర తీరంలో సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ సీఎం కేసీఆర్ సైకతశిల్పాన్ని తయారు చేశారు. పోరాట యోధుడు, పరిపాలకుడు, దూరదృష్టి గల నేతకు “హ్యాపీ బర్త్ డే కేసీఆర్ సార్” అని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో డెకరేషన్ చేశారు. దీప కాంతుల మధ్య కేసీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పార్టీ శ్రేణులు.