వామ్మో ఇంత మంది బాధితులా.. క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం!.. జనాల నుంచి కోట్లు కాజేసిన కేటుగాళ్లు!

కరీంనగర్‌ జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి ఒక కంపెనీ అమాయక ప్రజలను నిండా ముంచేసింది. దీని ఉచ్చులో పడి వేలాది మంది మోసపోయారు.. కోట్ల రూపాయాలు కోల్పోయారు.. ఒక్క కంపెనీలు చేసిన మోసానికి ఎంతో మంది రోడ్డున పడ్డారు. మొదట కాస్తా లాభాలు ఇచ్చి ఆశ చూసిన కంపెనీ.. అధిక పెట్టుబడులు రాగానే అందిన కాడికి దోచుకొని బిచాన ఎత్తేసింది.

వామ్మో ఇంత మంది బాధితులా.. క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం!.. జనాల నుంచి కోట్లు కాజేసిన కేటుగాళ్లు!
Karimnagar Cryptocurrency S

Edited By: Anand T

Updated on: Jul 23, 2025 | 10:30 AM

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారుగా 15 వేయిలకు పైగా క్రిప్టో కరెన్సీ బాధితులు న్నారు. గత రెండేళ్లుగా వీరంగా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడుతున్నారు. అయితే కస్టమర్లను పెంచుకునేందుకు సదురు కంపెనీ పెట్టుబడి పెట్టిన వాళ్లకు కొంత లాభాన్ని ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పెట్టించేందుకు కొంత మంది ఎజేంట్ అవతారమెత్తారు. 25 నుంచి 30 శాతం వరకు వడ్డీ వస్తుందని నమ్మబలికారు. కస్టమర్లను నమ్మించేందుకు మొదట చెప్పిన విధంగానే అధిక వడ్డిలు ఇచ్చారు. అంతే కాకుండా కొంత మందిని దేశాల్లో తీసుకెళ్లి.. మంచి పార్టీలు ఇచ్చారు. తమకు లాభాలు అధికంగా రావడంతోనే కంపెనీలు తీసుకెళ్లాయని స్థానికంగా ప్రచారం చేసుకున్నారు. ఇది నమ్మి చాలా మంది పెట్టుబడులు పెట్టారు. ఇదే అదునుగా భావించిన సదురు కంపెనీ అందిన కాడికి డబ్బును తీసుకొని బిచాన ఎత్తేసింది.

ఇదే తరహా మోసం జగిత్యాల జిల్లాలోనూ వెలుగు చూసింది. పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి మోసపోయిన కొంత మంది బాధితులు గుట్టు చప్పుడు కాకుండా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పేరు బయటకు రాకుండా చూడాలని పోలీసులను కోరుతున్నారు. ఇందులో అధికంగా ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులే ఉన్నారు. బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నా.. ఎవరు బయటకు రావడం లేదు. ఇదంతా ఆన్లైన్ బిజినెస్ కావడంతో ఎవరికి తెలియకుండా రహస్యంగా పెట్టుబడి పెట్టారు. ఆన్లైన్లో డిజిటల్ కరెన్సీ ఉన్నా.. అవి డబ్బుల రూపంలో రావడం కష్టం. రాజకీయ పార్టీకి చెందిన నేతలు, పోలీసు అధికారులు అందరూ.. ఇందులో పెట్టుబడి పెట్టి మోసపోయారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ముఖ్యమైన కంపెనీ ప్రతినిధులు దేశాల్లోకి వెళ్లిపోయారు.. ఇక్కడి ఏజెంట్లు కూడా ఎవరికి దొరకకుండా తిరుగుతున్నారు. తమకు సంబంధం లేదని చేతులేత్తేస్తున్నారు.

క్రిప్టో కరెన్సీపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో.. చాలా మంది ఇందులో పెట్టుబడి పెట్టారు. గత ఆరు నెలల నుంచి పూర్తిగా లావాదే ‘లు ఆగిపోయాయి. ఇప్పుడు.. ఇప్పుడే.. కొంత మంది బాధితులు బయటకు వస్తున్నారు. కానీ ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. ఆన్లైన్ పెట్టుబడి పెట్టడంతో.. సదరు కంపెనీ ప్రతినిధులను అరెస్టు చేయడం కూడా ఇబ్బందిగానే మారింది. ఇప్పుడు ఎక్కడ విన్న క్రిఫ్టో కరెన్సీ గురించే మాట్లాడుకుంటున్నారు. తాము మోసపోయామని చెప్పుకుంటున్నారు. అయితే దీనిపై స్పందించిన పోలీసులు ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇలాంటి పెట్టుబడుల విషయంలో జనం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేయవచ్చిన పోలీసులు అంటున్నారు.

మరిన్ని తెంలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.