
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తొలిసారి ఓ ఇంటిని కొనుగోలు చేశారు. సుధీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న బండి సంజయ్ రెండు సార్లు కార్పొరేటర్‌గా, రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఇంతకాలం తన అత్తమ్మ నివాసంలోనే ఉంటున్నారు. తన పేరిట ఒక్క ఆస్తి కూడా లేదు. దీంతో.. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయం పక్కనున్న రెండు గుంటల స్థలం కలిగిన పాత నివాసం అమ్మకానికి రావడంతో 98 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు.
ఇందులో రూ.85 లక్షలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రుణం తీసుకున్నాను అన్నారు సంజయ్. కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి బండి సంజయ్ ఆ ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకున్నారు. ఒక్కసారి కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యేగా గెలిస్తేనే వందల కోట్ల రూపాయలు సంపాందించుకోవడం, బినామీ పేర్లతో వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకునే ఈ రోజుల్లో కేంద్రమంత్రి హోదాలో ఉండి.. బ్యాంకు లోనుతో ఇల్లు కొనుక్కోవడంపై.. కార్యకర్తలు, నేతలు సంతోషం వ్యక్తం చేశారు. తమ నాయకుడు ఎక్కడా అవినీతికి పాల్పడకుండా నిజాయితీ పనిచేస్తున్నారంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..