AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మణికొండలోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు – అడ్డంగా బుక్కయ్యారు

తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో (TGANB), నార్సింగి పోలీసులతో కలిసి మణికొండలోని ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఒక నైజీరియన్ జాతీయుడిని మరియు ఇద్దరు స్థానిక డ్రగ్స్ వ్యాపారులను అరెస్టు చేసింది. పోలీసులు వారి నుంచి 107 గ్రాముల కొకైన్, 25 గ్రాముల ఎక్స్‌టసీ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ వీధి విలువ రూ 30 లక్షలు ఉంటుందని అంచనా.

Hyderabad: మణికొండలోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు - అడ్డంగా బుక్కయ్యారు
Manikonda Drug Bust
Ram Naramaneni
|

Updated on: Jun 24, 2025 | 7:52 AM

Share

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అల్కాపూరి టౌన్‌ షిప్‌లో టీ న్యాబ్, నార్సింగ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. 30 లక్షల విలువైన STCP పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఒక విదేశీయుడితో పాటు.. ఇద్దరు లోకల్ డ్రగ్ పెడ్లర్స్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. మణికొండలో ఓ లగ్జరీ ఫ్లాట్ రెంట్‌కు తీసుకుని.. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు గుర్తించారు. విదేశీయుడు విస్డం ఒనేకా, మణికొండకి చెందిన గోపిశెట్టి రాజేష్, పశ్చిమ గోదావరికి చెందిన బొమ్మ దేవర వీరరాజును అదుపులోకి తీసుకుని.. వీరి వెనుక ఎవరున్నారో ప్రశ్నిస్తున్నారు.

విదేశీయుడు నకిలీ పాస్ పోర్ట్‌తో హైదరాబాద్‌కు వచ్చినట్లు గుర్తించారు. మొయినాబాద్ పీఎస్ పరిధిలోని అజీజ్ నగర్‌లో ఉన్న ఫాం హౌజ్‌లో మే 29న నిర్వహించిన రేవ్ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసినట్లు అంగీకరించింది ఈ ముఠా. మే 31న మంగళగిరిలో ఫణి రాజ్ అనే వ్యక్తికి 15 గ్రాముల కొకైన్ ఇచ్చినట్లు పోలీసులకు చెప్పారు. ఈ ముఠా నుంచి డ్రగ్స్ కొన్న ఫణిరాజ్, పవిత్ర రెడ్డి, సతీష్, సదా శివ, సుధీర్, భానులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విజేతకే కాదు.. రన్నరప్‌తోపాటు ఆ జట్లపైనా కాసుల వర్షం.. !
విజేతకే కాదు.. రన్నరప్‌తోపాటు ఆ జట్లపైనా కాసుల వర్షం.. !
ఏడాది పాటు వచ్చే ఆకు కూరలు.. ఒక్కసారి నాటితే 365 రోజులు కూరలే ..
ఏడాది పాటు వచ్చే ఆకు కూరలు.. ఒక్కసారి నాటితే 365 రోజులు కూరలే ..
ఆ సినిమా ఫ్లాప్ అని ప్రభాస్‌కు చెబితే షాక్ అయ్యాడు.. చివరకు
ఆ సినిమా ఫ్లాప్ అని ప్రభాస్‌కు చెబితే షాక్ అయ్యాడు.. చివరకు
ఇదో వింత ప్రేమాయణం..1995 నాటి ప్రేయసి ముందు లక్షలు పోసినా తక్కువే
ఇదో వింత ప్రేమాయణం..1995 నాటి ప్రేయసి ముందు లక్షలు పోసినా తక్కువే
వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? రుతుపవనాలపై బిగ్ అప్డేట్
వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? రుతుపవనాలపై బిగ్ అప్డేట్
మీ గోళ్లే మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తాయని తెలుసా?
మీ గోళ్లే మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తాయని తెలుసా?
కేంద్రం ఇలా చేస్తే పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.22 వరకు తగ్గుతుంది?
కేంద్రం ఇలా చేస్తే పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.22 వరకు తగ్గుతుంది?
SRH బ్యాటర్ల ఊచకోత.. ఐపీఎల్ హిస్టరీలోనే భువీ చెత్త రికార్డ్..!
SRH బ్యాటర్ల ఊచకోత.. ఐపీఎల్ హిస్టరీలోనే భువీ చెత్త రికార్డ్..!
పిల్లలకు ఎంతో ఇష్టమైన మట్కా కుల్ఫీ.. ఇంట్లో ఎలా చేయాలి అంటే
పిల్లలకు ఎంతో ఇష్టమైన మట్కా కుల్ఫీ.. ఇంట్లో ఎలా చేయాలి అంటే
ఈ ఒక వస్తువు మీ ఇంట్లో ఉంటే చాలు.. లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీపైనే
ఈ ఒక వస్తువు మీ ఇంట్లో ఉంటే చాలు.. లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీపైనే