Karimnagar Election Result 2023: కరీంనగర్‌ గడ్డపై గులాబీ జెండా.. బండి సంజయ్‌పై గంగుల విజయం..

|

Dec 03, 2023 | 7:34 PM

Karimnagar Assembly Election Result 2023 Live Counting Updates: కరీంనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మూడున్నర లక్షలకు పైగా ఓట్లుండగా.. మొన్నటి ఎన్నికల్లో 63.23 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఓటర్లలో మున్నూరు కాపు, ముస్లిం మైనార్టీలు ఎక్కువ. అందుకే మూడు ప్రధాన పార్టీల నుంచీ ముగ్గురు మున్నూరు కాపు సామాజిక వర్గ అభ్యర్థులే బరిలో నిలవడంతో కరీంనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో రాజకీయాలు సెగలు రేగాయి. ఫైనల్‌గా...

Karimnagar Election Result 2023: కరీంనగర్‌ గడ్డపై గులాబీ జెండా.. బండి సంజయ్‌పై గంగుల విజయం..
Karimnagar Election Result
Follow us on

కరీంగర్ గడ్డపై గులాబీ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల గెలుపొందారు. 3,169 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై విజయం సాధించారు. తొలుత స్వల్ప మెజార్టీతో గంగుల గెలిచినట్లు తేలడంతో.. రీకౌంటింగ్‌కు బండి పట్టుబట్టారు. రీకౌంటింగ్‌లో కూడా గంగుల గెలిచినట్లు తేలింది.  ఇదిలా ఉంటే.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొన్న నియోజకవర్గాల్లో కరీంనగర్ (Karimnagar Assembly Election) ఒకటి.  మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి గంగుల కమలాకరే పోటీలో ఉన్నారు. ఇక్కడి నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టిన గంగుల.. మరోసారి సత్తా చాటారు. అయితే బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్‌ ఇక్కడి నుంచి బరిలో నిలవడంతో కమలాకర్‌కు తీవ్ర పోటీనిచ్చారు.

కరీంనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మూడున్నర లక్షలకు పైగా ఓట్లుండగా.. 2023 ఎన్నికల్లో 63.23 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఓటర్లలో మున్నూరు కాపు, ముస్లిం మైనార్టీలు ఎక్కువ. అందుకే మూడు ప్రధాన పార్టీల నుంచీ ముగ్గురు మున్నూరు కాపు సామాజిక వర్గ అభ్యర్థులే బరిలో నిలవడంతో కరీంనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో రాజకీయాలు సెగలు రేపాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

కరీంనగర్ నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం..

2009 నుంచి కరీంనగర్‌ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు గంగుల కమలాకర్‌. 2009లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన గంగుల… ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో.. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున రెండుసార్లు పోటీచేసి కరీంనగర్‌లో గులాబీ జెండా ఎగరేశారు. ఇప్పుడు రాష్ట్రమంత్రిగా ఉన్నారు. అయితే, గత రెండు దఫాలూ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌ పోటీ చేసి కమలాకర్‌ చేతిలో ఓడిపోయారు.

2018లో కమలాకర్‌కు బండి సంజయ్‌ గట్టిపోటీ ఇచ్చినా విజయం మాత్రం దక్కలేదు. అయితే, ఆ తర్వాతే రాజకీయంగా అనూహ్య పరిణామాలు సంభవించాయి. కరీంనగర్‌ అసెంబ్లీ అభ్యర్థిగా ఓడిన సంజయ్‌… ఆ వెంటనే జరిగిన జనరల్‌ ఎలక్షన్స్‌లో మాత్రం ఎంపి అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రమోషన్‌ కొట్టేసిన సంజయ్‌… అధిష్టానం ఆదేశాలతో తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆ తర్వాత ఆయన్ను పార్టీ రాష్ట్ర సారధ్య బాధ్యతల నుంచి తప్పించి.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు కమలదళం పెద్దలు.

2018ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడోస్థానానికి పరిమితమై ఘోరపరాభవం మూటగట్టుకున్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.  దీంతో, హస్తం పార్టీ తరపున పురుమళ్ల శ్రీనివాస్‌ను బరిలోకి దించారు. వీరు ముగ్గురూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 పార్టీల ఫలితాలు లైవ్