Kanha Music Fest: నేడు మ్యూజికల్ ఫెస్టివల్‌లో చివరి రోజు.. సంగీత ప్రియులను అలరించనున్న గాయని సుధా రఘునాథన్..

|

Feb 03, 2023 | 8:09 AM

కర్నాటక సంగీతంలో అతిపెద్ద క్రౌడ్-పుల్లర్‌లలో ఒకరు. కర్నాటిక్ డాయెన్ MS సుబ్బులక్ష్మి తర్వాత న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో .. అక్టోబర్ 2, 2016న..  ప్రదర్శన ఇచ్చిన భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు సుధా రఘునాథన్.

Kanha Music Fest: నేడు మ్యూజికల్ ఫెస్టివల్‌లో చివరి రోజు.. సంగీత ప్రియులను అలరించనున్న గాయని సుధా రఘునాథన్..
Sudha Ragunathan
Follow us on

హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనంలో ఘనంగా ధ్యానం అదిగురువు లాలాజీ మహారాజ్ 150 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మ్యూజికల్ ఫెస్టివల్  అండ్ మెడిటేషన్ సెక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మ్యూజికల్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు.  నేడు మ్యూజికల్ ఫెస్టివల్ లో చివరి రోజు.. ఈరోజు భారతీయ కర్నాటక గాయని, స్వరకర్త సుధా రఘునాథన్ తన ప్రదర్శనతో సంగీత ప్రియులను అలరించనున్నారు.

ప్రసిద్ధ కర్ణాటక గాయకురాలు, స్వరకర్త సుధా రఘునాథన్..  కర్నాటక సంగీతంలో అతిపెద్ద క్రౌడ్-పుల్లర్‌లలో ఒకరు. కర్నాటిక్ డాయెన్ MS సుబ్బులక్ష్మి తర్వాత న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో .. అక్టోబర్ 2, 2016న..  ప్రదర్శన ఇచ్చిన భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు సుధా రఘునాథన్. అద్భుతమైన గానంతో కచేరీలకు ప్రసిద్ధి చెందింది. పద్మ శ్రీ, పద్మభూషణ్-గ్రహీత..  రఘునాథన్ తన విజయాలకు తన గురువు..  పురాణ సంగీత విద్వాంసురాలు ML వసంతకుమారి కారణం అని.. ఆమెకు రుణపడి ఉన్నానని చెప్పారు. సుధా రఘునాథన్ వివాహంచేసుకున్నారు. కౌశిక్, మాలవికా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చెన్నైలో సుధా రఘునాథన్.. తరువాత బెంగళూరుకి షిఫ్ట్ అయ్యారు.  చెన్నైలోని గుడ్ షెపర్డ్ కాన్వెంట్‌లో ప్రాధమిక విద్యను అభ్యసించారు. ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని చేశారు. తల్లి వి. చూడామణీ దగ్గర  మూడేళ్ళ వయసులోనే సుధా కర్ణాటక సంగీతంలో శిక్షణ ప్రారంభించారు. మూడేళ్ల వయస్సు నుంచి భజనలు, హిందూ భక్తి పాటలు నేర్చుకోవడం ప్రారంభించారు. అనంతరం బి.వి.లక్ష్మణ్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. అయితే 1977 లో కర్ణాటక సంగీతాన్ని డాక్టర్ ఎం.ఎల్. వసంత కుమారి వద్ద అభ్యసించడానికి సుధ రఘునాధన్ కు ప్రభుత్వ స్కాలర్‌షిప్ లభించింది. ఇదే ఆమె మ్యూజిక్ కెరీర్ లో పెద్ద మలుపుగా నిలిచింది. దాదాపు 13 ఏళ్లపాటు వసంత కుమారి వద్ద శిష్యరికం చేశారు. గురుకుల శైలిలో ఎం.ఎల్. వసంతకుమారి ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. వసంత కుమారి కచేరీ చేసే సమయంలో సుధా తంబురా వాయిస్తూ తోడుగా నిలిచేవారు. 1990లో.. వసంత కుమారి మరణాంతరం.. తి సంవత్సరం సుధా రఘునాథన్ మద్రాస్ మ్యూజిక్ సీజన్లో ప్రదర్శనలను ఇచ్చేవారు.

ఇవి కూడా చదవండి

సుధా తన గాత్రంతో సంగీతంతో సంగీత ప్రియులను మంత్రం ముగ్ధులను చేస్తారు.  2013 లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగిత కలానిధి పురస్కారం అందుకున్నారు. జనవరి 2015 లో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర గౌరవం అయిన పద్మ భూషణ్ లభించింది. జనవరి 2015లో తమిళ చిత్రం ‘తన్నీర్’ తో సంగీత దర్శకురాలిగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళ సినిమాలో ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా పనిచేశారు.

రఘునాథన్ ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చారు. అంతేకాదు సంగీతాన్ని తన తరవాత తరాలకు అందించేలా 2017 లో సుధర్నవ అకాడమీ ఫర్ మ్యూజికల్ ఎక్సలెన్స్” ను ప్రారంభించారు. తన విద్యార్థులకు కూడా సంగీత సంప్రదాయాన్ని నేర్పిస్తున్నారు.  తన స్టూడెంట్స్ తో  ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికల్లో సంగీత ప్రదర్శనలిస్తున్నారు. 1999లో స్వచ్ఛంద సేవా సంస్థ సముదాయ ఫౌండేషన్‌ను ప్రారంభించి.. వెనుకబడిన వర్గాల వారికీ అండగా నిలుస్తున్నారు.

 

మరిన్ని తెలంగాణ వర్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..